
మంథని, వెలుగు: పెద్దపల్లి జిల్లా మంథని మున్సిపాలిటీ పరిధిలోని బోయిన్‌పేట గ్రామానికి చెందిన మత్స్యకారుడు తాళ్లపల్లి శేఖర్(45) పాముకాటుతో చనిపోయాడు. వివరాలిలా ఉన్నాయి.. మంథని రావుల చెరువులో చేపలు పట్టేందుకు వెళ్లగా, పాము కాటు వేసింది. దీనిని గమనించకుండా శేఖర్ ఇంటికి వెళ్లి అస్వస్థతకు గురై చనిపోయాడు. శేఖర్ మృతి పట్ల ముదిరాజ్ సంఘం నేతలు సంతాపం ప్రకటించి ఆర్థికసాయం అందించారు.
కాగజ్ నగర్ : పాము కాటుతో రైతు మృతిచెందిన ఘటన కుమ్రంభీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో జరిగింది. కౌటాల మండలం మొగడ్ దగడ్ గ్రామానికి చెందిన రైతు ఉర్వెత నాందేవ్(60) శుక్రవారం ఉదయం భార్య నిర్మలతో కలిసి గ్రామ శివారులోని తన పత్తి చేనులో కలుపు తీసేందుకు వెళ్లారు. అతడిని పాము కాటు వేయడంతో భార్య చుట్టుపక్కల ఉన్నవారికి చెప్పింది. వెంటనే నాందేవ్ ను 108లో సిర్పూర్ ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మృతిచెందాడు. మృతుడి కొడుకు కార్తీక్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు.