
ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో పాము కలకలం రేపింది. దాదాపు 90 సంవత్సరాల క్రితం నిర్మించిన ఈ కార్యాలయం పూర్తిగా శిథిలావస్థకు చేరుకుంది. అంతేకాకుండా పాములకు తేళ్లకు ఆవాసంగా మారింది. ఉదయం కార్యాలయన్నీ శుభ్రం చేస్తున్న సమయంలో దాదాపు 7 ఫీట్ల నాగుపాము.. దానితో పాటు పాము కుబుసం కనిపించిందని కార్యలయ సిబ్బంది తెలిపారు. పాత రికార్డ్ లు పెట్టిన ప్రదేశంలోకి వెళ్లి పోయిందన్నారు. అయితే మళ్ళీ ఏ సమయంలో ఎటు వైపు నుండి వస్తుందోనని భయంతో విధులు నిర్వహిస్తున్నామంటున్నారు. అంతేకాకుండా భవనం పూర్తిగా పాడై పోయిందని... స్లాబ్ పెచ్చులు ఊడి కిందపడిపోతుంద సిబ్బంది అంటున్నారు. నూతన భవన నిర్మాణం త్వరగా పూర్తి చేయాలని కోరుతున్నారు.
ఇవి కూడా చదవండి:
లతా మంగేష్కర్ ఆరోగ్యంపై కీలక ప్రకటన