టూ వీలర్​లో దూరిన పాము.. వెహికల్​ ఒక్కొక్క పార్టు విప్పి బయటకు తీసిన్రు

టూ వీలర్​లో దూరిన పాము..  వెహికల్​ ఒక్కొక్క పార్టు విప్పి బయటకు తీసిన్రు
  • గద్వాల కోర్టు ఆవరణలో ఘటన

గద్వాల, వెలుగు: గద్వాల కోర్టు ఆవరణలో ఉంచిన ఓ టూ వీలర్​లోకి పాము దూరింది. దీంతో వెహికల్​ పార్టులు ఒక్కొక్కటిగా ఊడదీసి పామును బయటకు తీయాల్సి వచ్చింది. కోర్టులో పని చేసే మహేశ్​ గురువారం బండిని బయట పార్క్​ చేసి లోపలకు వెళ్లాడు. అప్పటికే కోర్టు ఆవరణలో కక్షిదారులు పేషీకి వచ్చి వెయిట్ ​చేస్తున్నారు. కొద్దిసేపటికే వారి మధ్య ఓ పాము కనిపించడంతో చంపేందుకు ప్రయత్నించారు.

వెంటాడగా భయపడిన పాము సరాసరి మహేశ్​ టూ వీలర్​లోకి దూరింది. వాహనాన్ని కర్రతో కొట్టినా బయటకు రాలేదు. దీంతో మహేశ్​కు సమాచారమిచ్చారు. ఆయన వచ్చి ప్రయత్నించినా ఫలించలేదు. చివరకు పాములు పట్టే వ్యక్తిని పిలిపించగా అతడు వచ్చి సీటుతో పాటు లోపల పార్ట్స్ ​విప్పి చూశాడు. కనిపించకపోవడంతో చివరకు కాలు పెట్టుకునే చోట కొన్ని పార్టులు ఊడదీయగా తోక కనిపించింది. దీంతో పామును బయటకు లాగి తీసుకువెళ్లి అడవిలో వదిలిపెట్టాడు.