
ఫంక్షన్లు, పెండ్లిండ్లు... ఎక్కడ చూసినా డ్రోన్ కెమెరాలు కనిపిస్తున్నాయి. వాటిని చూసినప్పుడల్లా చిన్న డ్రోన్ కెమెరా ఉంటే బాగుండు అనిపిస్తుంది. స్నాప్‌చాట్ ఈమధ్యే ‘పిక్సీ’ అనే సెల్ఫీ డ్రోన్ కెమెరా తీసుకొచ్చింది. జేబులో పట్టేంత సైజులో ఉంటుంది ఈ కెమెరా. పసుపు రంగులో ఉన్న ఈ ఫ్లయింగ్ కెమెరాతో ఫొటోలు దిగొచ్చు. వీడియోలు తీయొచ్చు. అంతేకాదు వాటిని స్నాప్‌చాట్ యాప్‌కి పంపొచ్చు కూడా. ఈ కెమెరాలో విశేషాలు చాలానే ఉన్నాయి. అవేంటంటే.... ఇందులో కంట్రోలర్ ఉండదు. చేత్తో పట్టుకోవాల్సిన అవసరం లేకుండా అరచేతిలో ఎగురుతూ ఫొటోలు తీస్తుంది. ఆరు ప్రోగ్రామ్డ్ ఫ్లైట్ ప్యాటర్న్ సాయంతో పనిచేస్తుంది ఈ డ్రోన్. వీటిని యాక్సెస్ చేయాలంటే డివైజ్ మీదున్న డయల్ బటన్ నొక్కాలి. ఛార్జింగ్ బ్యాటరీతో పనిచేసే ఈ కెమెరా101 గ్రాముల బరువు ఉంటుంది. ఒకసారి ఫుల్ ఛార్జింగ్ పెడితే ఎనిమిది ఫ్లైట్స్ తీసుకోవచ్చు. ఇందులోని 12 ఎంపీ సెన్సర్ దాదాపు వంద వీడియోలు లేదా వెయ్యి ఫొటోలు తీస్తుంది. ఇవన్నీ 16 జీబీ డ్రైవ్‌లో స్టోర్ అవుతాయి. ఈ డ్రోన్ కెమెరా ఆన్లైన్లో 17 వేల రూపాయలకు దొరుకుతుంది.