శ్రీనగర్ హైవేపై మంచు..రెండో రోజు ట్రాఫిక్ నిలిపివేత

శ్రీనగర్ హైవేపై  మంచు..రెండో రోజు ట్రాఫిక్ నిలిపివేత

జమ్ముకశ్మీర్ లో దట్టంగా మంచు పడుతోంది. శ్రీనగర్ లేహ్ హైవేపై మంచు పేరుకోవడంతో రోడ్డు క్లోజ్ చేశారు.   పూంచ్, రాజోరీ జిల్లాలను కలిపే మొఘల్ రోడ్ లో రెండో రోజు కూడా ట్రాఫిక్ నిలిపేశారు. శ్రీనగర్ సోనా, మార్గ్ గుమారీ రూట్ లలోనూ వాహనాల రాకపోకలు బంద్ అయ్యాయి. సోనామార్గ్ దగ్గర దట్టంగా మంచు కురుస్తోంది. భవనాలపై ఎక్కడ చూసినా తెల్లటి మంచు కనిపిస్తోంది.

PWD, R&B శాఖలకు చెందిన సిబ్బంది ట్రక్కులతో రోడ్లపై మంచును క్లియర్ చేస్తున్నారు. మెహర్ ప్రాంతంలో మంచు గడ్డలు పడుతున్నట్టు ట్రాఫిక్ అధికారులు తెలిపారు. జమ్ము-శ్రీనగర్ హైవేపై ప్రయాణం చేసేవారు ముందుగా స్టేటస్ తెలుసుకున్నాకే బయల్దేరాలని సూచించారు. అందుకోసం ట్రాఫిక్ కంట్రోల్ రూమ్స్  ఏర్పాటు చేశారు.