చంపేస్తే కేసే ఉండదు కదా..!

చంపేస్తే కేసే ఉండదు కదా..!

తనను చంపేస్తే గోల్డ్ స్కాం కేసే ముగుస్తుందని అన్నారు స్వప్నా సురేశ్.. ముఖ్యమంత్రి పినరయ్ విజయన్ పై చేసిన ఆరోపణలకు తాను కట్టుబడి ఉన్నానన్నారు. తన చుట్టుపక్కల ఉన్నవాళ్లను ఇబ్బంది పెట్టొద్దని కోరారు. ఈ విషయంలో ఏదైనా చేయాలనుకుంటే..తనను ఇబ్బంది పెట్టాలని అన్నారు. స్కాంలో సీఎం విజయన్, ఆయన కుటుంబసభ్యుల ప్రమేయం ఉందన్న ప్రధాన నిందితురాలు స్వప్న సంచలన ఆరోపణలు చేయడంతో కేరళలో విపక్షలు భగ్గుమన్నాయి. పినరయ్ విజయన్ వెంటనే రాజీనామా చేయాలని యూడీఎఫ్ నేతలు ఆందోళన చేస్తున్నారు. ముఖ్యమంత్రిపై ఇచ్చిన స్టేట్ మెంట్ వెనక్కి తీసుకోవాలని తనపై ఒత్తిళ్లు చేస్తున్నారని స్వప్నా సురేశ్ ఆరోపించింది.