ఈ సబ్బు ధర 2 లక్షలే !

ఈ సబ్బు ధర 2 లక్షలే !

చర్మ సౌందర్యం కోసం రకరకాల బ్యూటీ ప్రోడక్ట్స్​ వాడుతుంటారు. బ్రాండ్ ను బట్టి వందలు, వేలల్లో ఖర్చు చేస్తుంటారు. దాదాపుగా అన్ని ప్రోడక్ట్స్ అందుబాటు ధరల్లోనే ఉంటాయి. అయితే, ఈ సబ్బు మాత్రం కొంత రేటు ఎక్కువ. ఎక్కువ అంటే.. అక్షరాలా 2 లక్షల ఏడు వేల ఎనిమిది వందల రూపాయలు. ఇంతకీ దీనికి ఎందుకింత ఖరీదంటే..

‘ది ఖాన్ అల్ సాబూన్’ పేరుతో విక్రయిస్తున్న ఈ సబ్బును లెబనాన్, ట్రిపోలీలో బదెర్ హసన్ అండ్ సన్స్ అనే చిన్న కుటుంబం తయారుచేస్తుంది. 2013లో ప్రారంభమైన వీళ్ల బిజినెస్ ఇప్పుడు కోట్ల రూపాయల మార్కెట్ టర్నోవర్ ని అందుకుంది. ఈ సబ్బులు యూఏఈలోని ప్రత్యేక దుకాణాల్లోనే దొరుకుతాయి. ముఖ్యమైన వ్యక్తులు, అతిథులు మాత్రమే ఈ సబ్బుని వాడుతారు. 17 గ్రాముల బంగారం, డైమండ్ పౌడర్, సహజ తేనె, స్వచ్ఛమైన ఆలివ్ ఆయిల్, ఖర్జూరం మొదలైన వాటిని ఉపయోగించి ఈ సబ్బును తయారుచేస్తారు. చర్మ సౌందర్యం, సంరక్షణ కోసం ఉపయోగపడే ఈ సబ్బును కొనడానికి జనాలు ఎగబడుతున్నారు.