సౌదీ అరేబియా సంచలనం    2–1తో అర్జెంటీనాపై విజయం

సౌదీ అరేబియా సంచలనం    2–1తో అర్జెంటీనాపై విజయం

సాకర్‌‌‌‌‌‌‌‌ లెజెండ్‌‌‌‌‌‌‌‌ లియోనల్‌‌‌‌‌‌‌‌ మెస్సీ కెప్టెన్‌‌‌‌‌‌‌‌గా ఉన్నాడు. మరెందరో స్టార్​ ప్లేయర్లు అందుబాటులో ఉన్నారు. వరల్డ్‌‌‌‌‌‌‌‌ కప్‌‌‌‌‌‌‌‌లో రెండు సార్లు విజేతగా, మూడుసార్లు రన్నరప్‌‌‌‌‌‌‌‌గా ఘన చరిత్ర ఉంది. ఈ మధ్యే కోపా అమెరికా కప్‌‌‌‌‌‌‌‌ నెగ్గింది. పైగా, గత 36 మ్యాచ్‌‌‌‌‌‌‌‌ల్లో పరాజయమే లేకుండా వరల్డ్‌‌‌‌‌‌‌‌కప్‌‌‌‌‌‌‌‌లో టైటిల్‌‌‌‌‌‌‌‌ ఫేవరెట్‌‌‌‌‌‌‌‌గా బరిలోకి దిగింది. అలాంటి అర్జెంటీనా  వరల్డ్‌‌‌‌‌‌‌‌కప్‌‌‌‌‌‌‌‌ తొలి మ్యాచ్‌‌‌‌‌‌‌‌లోనే  ఓడిపోయింది. అది కూడా అనామక సౌదీ అరేబియా చేతిలో చిత్తయింది. సగటు సాకర్‌‌‌‌‌‌‌‌ అభిమాని కలలో కూడా ఊహించని ఈ ఫలితంతో  ఖతార్‌‌‌‌‌‌‌‌లో జరుగుతున్న  ఫిఫా వరల్డ్‌‌‌‌‌‌‌‌కప్‌‌‌‌‌‌‌‌లో సౌదీ టీమ్​  పెను సంచలనం సృష్టించింది.! 

లుసైల్‌‌‌‌‌‌‌‌: కెరీర్‌‌‌‌‌‌‌‌లో చివరి వరల్డ్‌‌‌‌‌‌‌‌కప్‌‌‌‌‌‌‌‌ ఆడుతున్న  సాకర్‌‌‌‌‌‌‌‌ సూపర్‌‌‌‌‌‌‌‌ స్టార్‌‌‌‌‌‌‌‌ లియోనల్‌‌‌‌‌‌‌‌ మెస్సీకి ఆదిలోనే  దిమ్మతిరిగే షాక్‌‌‌‌‌‌‌‌ తగిలింది. ప్రపంచకప్‌‌‌‌‌‌‌‌ చరిత్రలో ఇప్పటిదాకా మూడే విజయాలు సాధించిన సౌదీ అరేబియా..  మెస్సీ కెప్టెన్సీలోని   అర్జెంటీనాను ఓడించి టోర్నీలో ప్రకంపనలు రేకెత్తించింది. పేరుకు తగ్గ ఆటతో  పదో నిమిషంలోనే గోల్‌‌‌‌‌‌‌‌ కొట్టి  అర్జెంటీనాను లీడ్‌‌‌‌‌‌‌‌లోకి తెచ్చిన మెస్సీ.. ఆట చివరకు మోకాళ్లపై చేతులు పెట్టి నిరాశతో వైదొలిగాడు. ఇంకోవైపు తమ దేశ చరిత్రలోనే అది పెద్ద విజయాన్ని అందుకున్న సౌదీ ప్లేయర్లు ప్రపంచాన్నే జయించినంత ఆనందంతో సంబరాలు చేసుకున్నారు. మంగళవారం జరిగిన గ్రూప్‌‌‌‌‌‌‌‌–సి పోరులో సౌదీ టీమ్‌‌‌‌‌‌‌‌ 2–1తో అర్జెంటీనాపై గెలిచింది.

దాంతో, వరల్డ్‌‌‌‌‌‌‌‌కప్‌‌‌‌‌‌‌‌తో కెరీర్‌‌‌‌‌‌‌‌కు ఘన వీడ్కోలు పలకాలని ఆశిస్తున్న మెస్సీకి భారీ ఎదురు దెబ్బ తగిలినట్టయింది.  సలెహ్‌‌‌‌‌‌‌‌ అల్‌‌‌‌‌‌‌‌షెహ్రి  (48వ నిమిషంలో), సాలెమ్‌‌‌‌‌‌‌‌ అల్‌‌‌‌‌‌‌‌ దవ్‌‌‌‌‌‌‌‌సరి (53 వ. ని.) ఐదు నిమిషాల తేడాతో చెరో గోల్‌‌‌‌‌‌‌‌ కొట్టారు. ఈ ఇద్దరితో పాటు అర్జెంటీనాకు అడ్డు గోడగా నిలిచిన సౌదీ గోల్​ కీపర్​ అల్​ ఒవైస్​ ఈ మ్యాచ్​లో హీరోగా నిలిచాడు. 1990లో డిగో మారడోనా కెప్టెన్సీలోని అర్జెంటీనాకు కామరూన్‌‌‌‌‌‌‌‌, 2002 టోర్నీ తొలి పోరులో  టైటిల్‌‌‌‌‌‌‌‌ హోల్డర్‌‌‌‌‌‌‌‌ ఫ్రాన్స్‌‌‌‌‌‌‌‌కు సెనెగల్‌‌‌‌‌‌‌‌, 1950లో  ఇంగ్లండ్‌‌‌‌‌‌‌‌కు అమెరికా షాకిచ్చిన తర్వాత వరల్డ్‌‌‌‌‌‌‌‌కప్‌‌‌‌‌‌‌‌ చరిత్రలో ఇదే అది పెద్ద సంచలన ఫలితంగా భావిస్తున్నారు.  కాగా, ఈ హిస్టారిక్‌‌‌‌‌‌‌‌ విక్టరీని సెలబ్రేట్‌‌‌‌‌‌‌‌ చేసుకునేందుకు సౌదీ రాజు తమ దేశంలో బుధవారం గవర్నమెంట్​, ప్రైవేట్​ ఆఫీసులతో పాటు స్కూళ్లకు సెలవు ప్రకటించడం విశేషం. 

ఆధిక్యం నుంచి పరాజయంలోకి

భారీ అంచనాలతో బరిలోకి దిగిన అర్జెంటీనా ఈ మ్యాచ్​లో చేజేతులా ఓడిపోయింది. బలమైన ఆటగాళ్లు, ప్రస్తుత ఫామ్​చూస్తే మెస్సీసేన ఈ పోరులో గోల్స్​ వర్షం కురిపిస్తుందని ఆశిస్తే డీలా పడింది. ఆరంభంలోనే దక్కిన పెనాల్టీకి  పదో నిమిషం మెస్సీ చాలా ఈజీగా గోల్​ చేసి టీమ్​ను 1–0తో లీడ్‌‌‌‌‌‌‌‌లోకి తెచ్చాడు. ఆపై, 22వ నిమిషంలో మరో బాల్‌‌‌‌‌‌‌‌ను నెట్‌‌‌‌‌‌‌‌లోకి పంపినా.. రిఫరీ దాన్ని ఆఫ్‌‌‌‌‌‌‌‌సైడ్‌‌‌‌‌‌‌‌గా తేల్చి గోల్‌‌‌‌‌‌‌‌ ఇవ్వలేదు. 29వ నిమిషంలో మార్టినెజ్‌‌‌‌‌‌‌‌ కూడా బాల్‌‌‌‌‌‌‌‌ను గోల్‌‌‌‌‌‌‌‌ పోస్ట్‌‌‌‌‌‌‌‌లోకి పంపినా.. రివ్యూలో అది కూడా ఆఫ్‌‌‌‌‌‌‌‌సైడ్‌‌‌‌‌‌‌‌గా తేలింది. 34 నిమిషంలోనూ మరో  గోల్‌‌‌‌‌‌‌‌ కూడా ఆఫ్‌‌‌‌‌‌‌‌ సైడ్‌‌‌‌‌‌‌‌ కాగా ఫస్టాఫ్‌‌‌‌‌‌‌‌ను అర్జెంటీనా ఆధిక్యంతో ముగించింది. తొలిభాగంలో తేలిపోయిన సౌదీ.. బ్రేక్‌‌‌‌‌‌‌‌ తర్వాత అనూహ్యంగా చెలరేగింది.

సెకండాఫ్‌‌‌‌‌‌‌‌ మొదలైన మూడో నిమిషంలోనే అల్‌‌‌‌‌‌‌‌ షెహ్రి రైట్ కార్నర్‌‌‌‌‌‌‌‌ నుంచి గోల్‌‌‌‌‌‌‌‌ చేసి స్కోరు సమం చేశాడు. ఐదు నిమిషాల తర్వాత అల్‌‌‌‌‌‌‌‌ దవ్‌‌‌‌‌‌‌‌సరి దూరం నుంచి రైట్‌‌‌‌‌‌‌‌ ఫుట్‌‌‌‌‌‌‌‌తో అద్భుతమైన షాట్‌‌‌‌‌‌‌‌తో రెండో గోల్‌‌‌‌‌‌‌‌ చేయడంతో సౌదీ టీమ్‌‌‌‌‌‌‌‌ 2–1తో ఆధిక్యంలోకి వచ్చింది.  ఆ తర్వాత మరో గోల్‌‌‌‌‌‌‌‌ చేసేందుకు మెస్సీసేన అనేక ప్రయత్నాలు చేసి ఫెయిలైంది. 63వ నిమిషంలో గోల్‌‌‌‌‌‌‌‌ పోస్ట్‌‌‌‌‌‌‌‌ దగ్గరి నుంచి మార్టినెజ్‌‌‌‌‌‌‌‌ షాట్‌‌‌‌‌‌‌‌ను సౌదీ కీపర్‌‌‌‌‌‌‌‌ ఒవైస్‌‌‌‌‌‌‌‌  అద్భుతంగా సేవ్‌‌‌‌‌‌‌‌ చేశాడు. ఎక్స్‌‌‌‌‌‌‌‌ట్రా టైమ్‌‌‌‌‌‌‌‌లోనూ మరోసారి అర్జెంటీనా ప్రయత్నాన్ని అడ్డుకోవడంతో సౌదీ విజయానందంలో తేలిపోయింది.

డ్రాతో గట్టెక్కిన వేల్స్‌‌‌‌‌‌‌‌

గ్రూప్‌‌‌‌‌‌‌‌–ఎలో భాగంగా అమెరికాతో జరిగిన మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో వేల్స్‌‌‌‌‌‌‌‌ 1–1తో డ్రాతో గట్టెక్కింది. 36వ నిమిషంలోనే అమెరికా ప్లేయర్‌‌‌‌‌‌‌‌ టిమోతీ గోల్‌‌‌‌‌‌‌‌ కొట్టాడు. 82వ నిమిషంలో లభించిన పెనాల్టీకి స్కోరు సమం చేసిన గారెత్‌‌‌‌‌‌‌‌ బాలె వేల్స్‌‌‌‌‌‌‌‌కు ఓటమి తప్పించాడు. గ్రూప్‌‌‌‌‌‌‌‌–డిలో డెన్మార్క్‌‌‌‌‌‌‌‌–ట్యునీసియా మధ్య మ్యాచ్‌‌‌‌‌‌‌‌ ఒక్క గోల్‌‌‌‌‌‌‌‌ కూడా లేకుండా డ్రా అయ్యింది. గ్రూప్‌‌‌‌‌‌‌‌–సిలో మెక్సికో–పోలాండ్‌‌‌‌‌‌‌‌ మ్యాచ్​ కూడా 0–0తో డ్రాగా ముగిసింది.