చేర్యాల, వెలుగు: మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పనులపై సోమవారం అధికారులు సామాజిక తనిఖీ నిర్వహించారు. స్థానిక ఎంపీడీఓ ఆఫీసులో ఏర్పాటు చేసిన ప్రజావేదికలో 18 గ్రామాల పనులపై అధికారులు ఆడిట్ నిర్వహించారు. మొత్తం రూ. 8 కోట్ల పనులకు సంబంధించి సోషల్ఆడిట్ కొనసాగగా ఆయా గ్రామాల జీపీ సెక్రటరీలు, ఫీల్డ్ అసిస్టెంట్లు అందజేసిన వివరాలపై విచారణ చేపట్టారు. సాగులో ఉన్న భూమిలో పనులు చేయించడం, కూలీల సంతకాలు లేకుండా డబ్బులివ్వడం, 7 రిజిస్టర్లు సరిగా మెయింటెనెన్స్ చేయకపోవడం, 3 నెలలకొకసారి ఎంపీడీఓ, ఏపీఓ వెరిఫికేషన్ చేయకపోవడాన్ని గుర్తించారు.
మస్టర్స్లో ఎక్కువ రోజులు పని చేసిన వారికి తక్కువ రోజులు, తక్కువ రోజులు పనిచేసిన వారికి ఎక్కువ రోజులు చేసినట్లు వేసి పేమెంట్ చేసినట్లు గమనించారు. ఆడిట్లో రూ. 19వేలు రికవరీ, 17వేల ఫైన్లు వేసినట్లు అధికారులు చెప్పారు. కార్యక్రమంలో అడిషనల్డీఆర్డీఓ శ్రీనివాస్, ఎంపీడీఓ ప్రణయ్, డీవీఓ గణేశ్, సంతోష్ రెడ్డి, ఏపీడీ సతీశ్, అంబుడ్స్మెన్ఆరిఫ్, ఏఈ శివకుమార్, ఏపీఓ మంజులా, ఎస్ఆర్సీ పాండురంగ, పంచాయతీ సెక్రటరీలు, ఫీల్డ్ అసిస్టెంట్లు పాల్గొన్నారు.
