హైదరాబాద్ సిటీ, వెలుగు: వాట్సాప్ కాల్స్ రికార్డింగ్ చేస్తామని, సోషల్ మీడియా మానిటరింగ్ చేస్తామని, ప్రభుత్వానికి మొబైల్ ఫోన్లు కనెక్ట్ అవుతాయని.. సీఎం, పీఎం వ్యతిరేక సందేశాలు పంపితే వారెంట్ లేకుండా అరెస్ట్ చేస్తామంటూ హైదరాబాద్ సీపీ సజ్జనార్ పేరుతో సోషల్మీడియలో ఓ పోస్ట్ వైరల్ అయ్యింది. అయితే, ఇది పూర్తిగా తప్పుడు సమాచారమేనని, దీన్ని నమ్మకూడదని, ఎవరికీ షేర్ చేయకూడదని సిటీ పోలీసులు స్పష్టం చేశారు. ఇటువంటి ఫేక్ పోస్ట్‌లు కనిపిస్తే వెంటనే 100 తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు.
