
భారతీయుల జీవన విధానంపై సోషల్ మీడియాలో ఓ పోస్ట్ వైరల్ అవుతుంది. 1970లో భారతీయులు జీవనశైలి ఎలా ఉంది.. 2025 లో ఎలా ఉంది.. అప్పటికి .. ఇప్పటికి తేడా ఏంటి.. ప్రజల ఆలోచనలు అప్పుడెలా ఉన్నాయి.. ఇప్పుడెలా ఉన్నాయి.. అనే విషయాలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.
భారతీయుల జీవన విధానం రోజు రోజు రోజుకు మారుతుంది. అలాటే మధ్య తరగతి ప్రజల జీవన విధానంలో చాలా మార్పులు కనపడుతున్నాయి. 1970 వ సంవత్సరానికి... ఈ ఏడాది ( 2025) జీవితం ఎలా మారిపోయింది.. అప్పటికి .. ఇప్పటికి పరిస్థితులు ఎంత భిన్నంగా ఉన్నాయి.. మొదలగు విషయాల గురించి ప్రొఫెషనల్ హిమాన్షు కల్రా చేసిన లింక్డ్ఇన్ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది.
1970 నాటి లైఫ్ స్టైల్.. ఆర్థికంగా పెరుగుదల... మనశ్శాంతి మొదలగు విషయాల గురించి పోస్ట్ చేశారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పోస్ట్ వివరాల ప్రకారం అప్పుడు ప్రజల జీవన విధానం చాలా సరళంగా ఉండేదని.... డిగ్రీ అయిన వెంటనే .. ఏదొక ఉద్యోగంలో స్థిరపడేవారు.. డబ్బును సంపాదించేవారు.. పెళ్లి చేసుకొని.. పిల్లలతో సంతోషంగా ఉండేవారు..
కానీ 2025లో, పరిస్థితులు చాలా భిన్నంగా ఉన్నాయి. ప్రస్తుతం మధ్య తరగతి ప్రజలు జీవితంలో ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. అప్పుడు చాలా ఈజీగా కళాశాలలో చదువుకునేవారు... కాని ఇప్పుడు కాలేజీలో సీటు రావాలంటే ఎంతో కష్టపడాలి. లక్షలు డొనేషన్లు కట్టాలి.. పెద్ద ఎత్తున రికమండేషన్లు కావాలి. ఎడ్యుకేషన్ లోన్ తీసుకునేందుకు బ్యాంకుల చుట్టూ తిరగాలి... ఎలాకొలా సీటు సంపాదించి డిగ్రీ సాధించామంటే జాబ్ వస్తుందని గ్యారంటీ లేదు. డిగ్రీ అయిన తరువాత టెక్నికల్ కోర్సుల వెంట పడాలి.. అలా జీవితం సగం అయిపోతుంది.
అయినా సరే... ఉద్యోగాలు దొరకడం కష్టం. ప్రైవేట్ సంస్థల్లో చేరినా.. క్వాలిఫికేషన్ తగిన జాబ్ రాదు.. జీతాలు సరిపోకపోయినా ద్రవ్యోల్బణం పెరుగుతుంది. ఇంట్లో పెద్దవాళ్ల పోరు భరించలేక పెళ్లి చేసుకుంటారు... పిల్లలను కంటారు. ఇక కుటుంబ ఖర్చుల కోసం భార్యభర్తలు ఇద్దరు ఉరుకుల పరుగుల జీవితం గడుపుతున్నారు.
►ALSO READ | ఈ ఏఐ యాప్.. ఇంగ్లీష్ మాట్లాడడం నేర్పిస్తుంది.. ఫీడ్బ్యాక్ ఇస్తుంది !
ఇక ఆరోగ్య విషయంలో అప్పుడు ఎంతో మనశ్శాంతిగా జీవించేవారు.. ఏడాదికొకసారి ఫ్యామిలిట్రిప్ తో ఎంజాయి చేసేవారు. కాని ఇప్పుడు.. మనశ్శాంతి లేకుండా నిత్యం బిజీగా గడుపుతున్నారు. ఆర్థిక వ్యవవస్థ వృద్ది చెందినా ఉపయోగం లేదని హిమాన్షు తన పోస్ట్‌లో స్పష్టం చేశారు.
నెటిజన్ల కామెంట్లను ఒకసారి పరిశీలిస్తే... అప్పుడు.. ఇప్పుడు స్థిరత్వం.. ఆలోచన విధానం ఎలా మారిందోనని సొంత కష్టాలను పంచుకన్నారు. ఒకరు అప్పటికీ..... ఇప్పటికీ... జీవనవిధానంలో అతి పెద్ద మార్పు వచ్చిందని రాశారు. ఇంకొకరు 1970 లైఫ్ ఈజ్ అచ్చీవ్ మెంట్.. 2025 లైఫ్ ఈజ్ స్ట్రగుల్ అండ్ ప్రోబ్లమ్స్.. కాంపర్మైజ్ అని చెప్పుకొచ్చారు.