హాస్టల్ రూమ్ లో ఉరేసుకుంది : సాఫ్ట్ వేర్ ఉద్యోగి ఆత్మహత్య

హాస్టల్ రూమ్ లో ఉరేసుకుంది : సాఫ్ట్ వేర్ ఉద్యోగి ఆత్మహత్య

మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధి… అరుణోదయ కాలనీలోని ఓ హాస్టల్ లో శ్రీవిద్య అనే యువతి అనుమానాస్పద స్థితిలో చనిపోయింది. 25 ఏళ్ల వయసున్న ఆమె… సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పనిచేస్తోంది. ఆమె ఉరి వేసుకొని… ఊపిరి ఆడకుండా ముఖానికి ప్లాస్టిక్ కవర్ చుట్టుకుని ఆత్మహత్యకు పాల్పడిన స్థితిలో హాస్టల్ నిర్వాహకులు గుర్తించారు.

ఈ నెల 10న హాస్టల్ లో చేరిన శ్రీవిద్య… శుక్రవారం రాత్రి నుంచి తలుపు తీయలేదని… అనుమానం వచ్చి ఉదయం వేళ పోలీసులకు సమాచారం ఇచ్చారు హాస్టల్ సిబ్బంది. హాస్టల్ కు చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం.. గాంధీ హాస్పిటల్ కి పంపించారు. యువతి వివరాలు సేకరిస్తున్న మాదాపూర్ పోలీసులు… పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.