
‘బిగ్‌బాస్’ షోతో స్పెషల్ క్రేజ్ తెచ్చుకున్న సొహైల్, ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. డిఫరెంట్ కాన్సెప్టులు సెలెక్ట్ చేసుకుంటూ నటుడిగా గుర్తింపు తెచ్చుకోవాలను కుంటున్నాడు. త్వరలోనే ‘మిస్టర్ ప్రెగ్నెంట్’ అనే వెరైటీ టైటిల్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు సొహైల్. శ్రీనివాస్ వింజనంపాటి దర్శకుడు. మదర్స్ డే సందర్భంగా నిన్న ఈ మూవీ నుంచి స్పెషల్ వీడియో గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఇందులో అమ్మ గురించి సొహైల్ చెప్పిన డైలాగ్స్ ఆకట్టుకున్నాయి. ‘తొమ్మిది నెలల కష్టాన్ని నవ్వుతూ భరించి, ప్రాణాలకు తెగించి ఓ బిడ్డకు జన్మనిస్తారు. ఈ ఆడవాళ్లు గ్రేట్ సార్’ అంటూ సొహైల్ చెప్పిన ఎమోషనల్ డైలాగ్ సినిమాపై ఇంటరెస్ట్ క్రియేట్ చేస్తోంది. ఈ మూవీలో సొహైల్ ప్రెగ్నెంట్‌గా కనిపించనున్నాడు. రూపా కొడువయూర్ హీరోయిన్. సుహాసినీ మణిరత్నం, రాజా రవీంద్ర, బ్రహ్మాజీ, అలీ, హర్ష తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్నారు. చివరి దశలో ఉన్న షూటింగ్‌ను పూర్తిచేసి అతి త్వరలోనే ఈ మూవీని రిలీజ్ చేయనున్నట్టు చెప్పారు నిర్మాతలు అప్పిరెడ్డి, రవిరెడ్డి. దీంతో పాటు మరో నాలుగైదు చిత్రాల్లో నటిస్తున్నాడు సొహైల్.