ప్రపంచవ్యాప్తంగా సూర్యగ్రహణం మొదలైంది. మనదేశంలో సాయంత్రం 5 గంటల ఒక నిమిషం నుంచి 6 గంటల 26 నిమిషాల దాకా గ్రహణం ఉంటుంది. సూర్యగ్రహణం మొత్తం 4 గంటల 3 నిమిషాల పాటు ఉంటుంది. మొత్తం గ్రహణ పుణ్యకాలం గంటా 25 నిమిషాలు. సాయంత్రం వేళల్లో గ్రహణం ఏర్పడుతుండటంతో మధ్యాహ్నం రెండున్నర నుంచి రాత్రి 9 గంటల 39 నిమిషాల వరకూ ఆహార నియమాలు పాటించాలని పండితులు చెబుతున్నారు.ఈ ఏడాదిలో మొదటి సూర్యగ్రహణం ఏప్రిల్ 30న సంభవించింది. ఆ తర్వాత మళ్లీ రాలేదు. అయితే చాలా రోజుల తర్వాత ఇప్పుడు వచ్చింది.
గ్రహణం టైమ్ దగ్గర పడుతుండటంతో హైదరాబాద్ సిటీతో పాటు గ్రామీణ ప్రాంతాల్లోనూ జనం బయటతిరగకపోవడంతో రోడ్లన్నీ ఖాళీగా కనిపిస్తున్నాయి. సూర్య గ్రహణం నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని ఆలయాలు మూసివేశారు. సంప్రోక్షణ అనంతరం భక్తులను దర్శనానికి అనుమతించనున్నారు.
సూర్య గ్రహణాన్ని చూసేందుకు కొంతమంది భయపడతారు. గ్రహణం చూస్తే సమస్యలను ఎదుర్కొంటారని చెబుతుండటంతో వెనుకంజ వేస్తుంటారు. అయితే దాన్ని చూడకూడదని, చూస్తే పలు రకాల అనర్ధాలు జరుగుతాయని భయపడుతుంటారు. తగిన రక్షణ చర్యలు తీసుకుని సూర్య గ్రహణాన్ని చూడొచ్చని నిపుణులు సూచిస్తున్నారు. సోలార్ ఫిల్టర్లు ధరించి సూర్య గ్రహణం చూడాలని అంటున్నారు. దీనిని ఉపయోగించే ముందు తనిఖీ చేసుకోవాల్సి ఉంటుంది.
