కోల్ బ్లాక్‌‌‌‌లలో సోలార్‌‌‌‌‌‌‌‌ కరెంట్‌‌‌‌ ఉత్పత్తి!

కోల్ బ్లాక్‌‌‌‌లలో సోలార్‌‌‌‌‌‌‌‌ కరెంట్‌‌‌‌ ఉత్పత్తి!
  • కోల్ గ్యాసిఫికేషన్ కోసం భారీగా ఖర్చు చేయనున్న ప్రభుత్వం

న్యూఢిల్లీ : ఇప్పటికే మూసివేసిన బొగ్గు గునులను రెన్యూవబుల్ ఎనర్జీ తయారీకి వాడుకోవాలని ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది.  సోలార్ పార్క్‌‌‌‌లు, కోల్ గ్యాసిఫికేషన్ ద్వారా కరెంట్ ఉత్పత్తి పెంచాలని చూస్తోంది. విజన్ 2047 లో భాగంగా గ్రీన్ ఎనర్జీ వైపు షిఫ్ట్ అవ్వాలని చూస్తున్న ప్రభుత్వం ఇందుకోసం వివిధ చర్యలు తీసుకుంటోంది. సుమారు రూ. 30 వేల కోట్ల క్యాపిటల్ ఎక్స్‌‌‌‌పెండిచర్‌‌‌‌‌‌‌‌తో ఈ పనులు జరిగే అవకాశం ఉందని, ఇందులో రూ.24 వేల కోట్లు కోల్‌‌‌‌ ఇండియా పెడుతుందని ప్రభుత్వ అధికారి ఒకరు పేర్కొన్నారు. మిగిలిన రూ.6 వేల కోట్లు ప్రైవేట్ సెక్టార్‌‌‌‌‌‌‌‌ నుంచి వస్తుందని చెప్పారు. మెకనైజింగ్‌‌‌‌ కోల్ ఎవాక్యుయేషన్‌‌‌‌లో భాగంగా కన్వేయర్​ బెల్ట్‌‌‌‌లను వాడి బొగ్గును తరలిస్తారు.

ఇందుకోసం  పెద్ద మొత్తంలో కోల్ ఇండియా ఇన్వెస్ట్ చేయనుంది.   కోల్ గ్యాసిఫికేషన్‌‌‌‌ ( కోల్‌‌‌‌ను ఫ్యూయల్‌‌‌‌ గ్యాస్‌‌‌‌గా మార్చడం) వంటి సస్టయినబుల్ విధానాలతో పర్యావరణాన్ని హాని చేయకుండా చూస్తామని యూనియన్ కోల్ మినిస్టర్‌‌‌‌‌‌‌‌  ప్రహ్లాద్‌‌‌‌ జోషి కిందటి వారం పేర్కొన్నారు. కోల్ గ్యాసిఫికేషన్ ద్వారా సేకరించిన ఫ్యూయల్ గ్యాస్‌‌‌‌ను  హైడ్రోజన్‌‌‌‌, మీథేన్‌‌‌‌, మిథనాల్‌‌‌‌, ఇథనాల్ వంటి ఇంధనాల తయారీ కోసం వాడుకోవచ్చని  పేర్కొన్నారు. కోల్ గ్యాసిఫికేషన్ కోసం రూ. 6 వేల కోట్ల  వయబిలిటీ గ్యాస్ ఫండింగ్‌‌‌‌కు ప్రభుత్వం అనుమతి రావాల్సి ఉందని చెప్పారు. నేషనల్ కోల్ గ్యాసిఫికేషన్‌‌‌‌  ప్లాన్ కింద 2030 నాటికి 10 కోట్ల టన్నుల కోల్‌‌‌‌ను గ్యాస్‌‌‌‌గా మార్చాలని  ప్రభుత్వం టార్గెట్‌‌‌‌గా పెట్టుకుంది.