
తమిళనాడులో దారుణం జరిగింది. డీఎంకే కౌన్సిలర్ దాడిలో ఓ సైనికుడు మరణించగా..అతని సోదరుడు గాయపడ్డాడు. ఈ నెల 8న కృష్ణగిరి జిల్లా పోచంపల్లిలో ఆర్మీ జవాన్ ప్రభు(29) అతని సోదరుడు ప్రభాకరణ్ పబ్లిక్ ట్యాంక్ వద్ద బట్టలు ఉతుకుతుండగా డీఎంకే కౌన్సిలర్ చిన్నస్వామితో వాగ్వాదం జరిగింది. అయితే అదే రోజు కౌన్సిలర్ మరి కొంతమందితో కలిసి ఆర్మీ జవాన్ ఇంటికి వెళ్లి సోదరులిద్దరిపై దాడి చేశాడు. ఈ దాడిలో సోదరులిద్దరికి గాయలవ్వగా స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న జవాన్ ప్రభు మంగళవారం రాత్రి మరణించాడు. అతని సోదరుడి ప్రభాకరణ్ చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనలో నిందితుల్లో ఆరుగురిని ఫిబ్రవరి 9న పోలీసులు అరెస్ట్ చేశారు. ఇవాళ డీఎంకే కౌన్సిలర్‌తో సహా మరో ముగ్గురిని అరెస్టు చేశామని పోలీసులు చెప్పారు. కౌన్సిలర్ చిన్నసామి, సోదరులు కూడా బంధువులే అని డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ మనోహరన్ చెప్పారు.