
హైదరాబాద్, వెలుగు: ప్రముఖ ఆర్టిస్ట్ కట్టకూరి రవి ఆధ్వర్యంలో ఈ నెల 23 నుంచి 26 వరకు మాదాపూర్‌లోని స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో సోలో ఆర్ట్ ఎగ్జిబిషన్ జరగనుంది. ఈ ఎగ్జిబిషన్ ప్రారంభానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను ఆహ్వానించారు. వేర్ హౌజింగ్ కార్పొరేషన్ చైర్మన్ రాయల నాగేశ్వరరావుతో కలిసి రవి ప్రజా భవన్‌లో డిప్యూటీ సీఎం భట్టిని కలిసి కార్యక్రమానికి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన రవి కళాసేవలను ప్రశంసించారు. ఖమ్మం జిల్లాకు చెందిన రవి.. 12కు పైగా దేశాల్లో ఆర్ట్ ప్రదర్శనలు నిర్వహించారు. 10కి పైగా జాతీయ, అంతర్జాతీయ పురస్కారాలు అందుకున్నారు.