ఢిల్లీ తెలుగు జర్నలిస్ట్ లసమస్యలు పరిష్కరించండి

ఢిల్లీ తెలుగు జర్నలిస్ట్ లసమస్యలు పరిష్కరించండి

న్యూఢిల్లీ, వెలుగు: ఢిల్లీలో పని చేస్తోన్న తెలుగు జర్నలిస్ట్ ల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఢిల్లీ టీయూడబ్ల్యూజే జర్నలిస్టుల బృందం సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కలకు విజ్ఞప్తి చేసింది. మంగళవారం ఢిల్లీ తెలంగాణ భవన్ లో టీయూడబ్ల్యూజే అధ్యక్షుడు నాగిల్ల వెంకటేష్,  ప్రధాన కార్యదర్శి వంగ తిరుపతి, కోశాధికారి శిరీష్ రెడ్డి, యూనియన్ సభ్యులు వినతి పత్రం అందజేశారు. 

ప్రధానంగా నాలుగు అంశాలను సీఎం దృష్టికి తీసుకెళ్లారు. ఢిల్లీలో పని చేస్తోన్న తెలంగాణ జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు కేటాయించాలని, వాటి  కేటాయింపులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. అలాగే ప్రభుత్వం అమలు చేస్తోన్న ఆరోగ్యశ్రీ స్కీమ్ ను ఢిల్లీలోని తెలంగాణ జర్నలిస్టులకు వర్తింపజేసేలా కార్పొరేట్ హాస్పిటల్స్ ను ఎం ప్యానల్ మెంట్ చేయాలని కోరారు. 

ఢిల్లీలో కొత్తగా నిర్మించబోయే తెలంగాణ భవన్ లో  సీనియార్టీ ప్రాతిపదికన అక్రిడేటెడ్ జర్నలిస్టులకు  నామినల్ రెంట్ పద్ధతిలో క్వార్టర్స్ కేటాయించాలన్నారు. ముఖ్యంగా తెలంగాణ భవన్ లో తెలంగాణ యువతకి పెద్ద పీట వేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ విజ్ఞప్తులపై సీఎం, డిప్యూటీ సీఎంలు సానుకూలంగా స్పందించారు.