ఆదివాసీల సమస్యలను పరిష్కరిస్తా
V6 Velugu Posted on Jan 26, 2022
హైదరాబాద్: రాష్ట్రంలోని ఆదివాసీల సమస్యలను పరిష్కరిస్తామని మంత్రి కేటీఆర్ అన్నారు. ప్రగతిభవన్‌లో మంత్రి కేటీఆర్‌ను ఆదివాసీ సంఘాల ప్రతినిధులు, ఆదివాసీ టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు కలిశారు. తమ తెగలు ఎదుర్కొంటున్న పలు సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని విన్నించారు. ఆదివాసీలకు ప్రభుత్వం మరింత చేయూత అందించాలని విజ్ఞప్తి చేశారు. ఆదివాసీల కోసం తీసుకోవాల్సిన అభివృద్ధి సంక్షేమ చర్యలపైన తమ అభిప్రాయాలను తెలియజేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ ఆదివాసీ సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఆదివాసీ రైతులకు సంబంధించి అటవీశాఖ భూముల విషయంలో సానుకూల నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వ అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారన్నారు మంత్రి కేటీఆర్.
Tagged problems, Minister KTR, Tribal