
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ ప్రైవేట్ సెక్యూరిటీ గార్డ్స్ అండ్ అలైడ్ వర్కర్స్ యూనియన్స్(సీఐటీయూ అనుబంధం) రాష్ట్ర కన్వీనర్‌గా యాటల సోమన్న(రాష్ట్ర కేంద్రం) ఎన్నికయ్యారు. హైదరాబాద్‌లో జరిగిన రాష్ట్ర సదస్సులో కొత్త కమిటీని ఎన్నుకున్నారు.
కన్వీనింగ్ కమిటీ సభ్యులుగా కె.ఈశ్వర్ రావు, డి.స్రవంతి, బి.సత్యనారాయణ, శ్రీకాంత్, ఎన్.రవి కుమార్, రామకృష్ణ, రామారావ్, టి.సాంబయ్య, భాస్కర్ తో సహా మరో 10 మందితో నూతన రాష్ట్ర కన్వీనింగ్ కమిటీని ఎన్నుకున్నారు.