వెనకడుగూ వెయ్యాలి

వెనకడుగూ వెయ్యాలి

వెనకడుగు వేయడం అన్ని సందర్భాల్లో చెడు చేయదు. దానివల్ల కూడా లాభాలున్నాయి. ఆశ్చర్యంగా ఉందా?  ఇక్కడ చెప్పేది రివర్స్​ వాకింగ్​ గురించి.ఇది ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది అంటున్నాయి స్టడీలు.  

ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్​ స్పోర్ట్స్​ మెడిసిన్​ స్టడీ ప్రకారం రివర్స్​ వాకింగ్, రన్నింగ్​ని మించిన బెస్ట్ కార్డియో ఎక్సర్​సైజ్​ మరొకటి లేదు. వంద అడుగుల రివర్స్​ వాకింగ్​ వెయ్యి అడుగుల నార్మల్​ వాకింగ్​తో సమానం. ఇది బ్రెయిన్​ని యాక్టివ్​ చేస్తుంది. అలాగే కాలు వెనక భాగంలో ఉండే మజిల్స్​ నార్మల్ వాకింగ్​లో ఇన్వాల్వ్​​ అవ్వవు. కానీ, రివర్స్​ వాకింగ్​లో అన్ని కండరాలు కదులుతాయి. దాంతో కాళ్లు బలంగా అవుతాయి. రివర్స్​ వాకింగ్​ వల్ల కండరాలకి బ్లడ్, ఆక్సిజన్​ సర్క్యులేషన్​ వేగవంతం అవుతుంది. స్టడీల ప్రకారం మోకాళ్ల నొప్పులు, గాయాలతో  బాధపడేవాళ్లకు రివర్స్​ వాకింగ్​ బెస్ట్ ఆప్షన్​ . రివర్స్​ వాకింగ్ వల్ల మోకాళ్లపై ఎక్కువ ఒత్తిడి పడదు. దాంతో  ఎన్ని అడుగులేసినా నొప్పులు బాధ ఉండదు. అలాగే రివర్స్​ వాకింగ్, రన్నింగ్ వల్ల పాత నొప్పుల నుంచి కూడా రిలీఫ్​ ఉంటుంది.   
    

ప్రతిరోజు పావుగంట  రివర్స్​ వాకింగ్ చేస్తే వెన్ను నొప్పి తగ్గుతుంది. అలాగే తరచూ ఈ ఎక్సర్​సైజ్ చేయడం వల్ల  ఒకటిరెండు నెలల్లోనే శరీర బరువులో కూడా  తేడా వస్తుంది. గుండె పనితీరు కూడా బాగుంటుంది అంటున్నారు రీసెర్చర్​లు. అలాగే రివర్స్​ వాకింగ్​ వల్ల బ్రెయిన్​కి, బాడీకి మధ్య కో– ఆర్డినేషన్​ బాగుంటుంది.  మరింకేం! ఇన్ని లాభాలు ఉన్నప్పుడు వెనకడుగు వేస్తే సరి.

మరిన్ని వార్తల కోసం...

హోండా కార్ల ధరలు పెరుగుతున్నయ్​

మరోసారి రెపో రేటు పెంపు?