మారనున్న కొన్ని క్రెడిట్ కార్డ్ రూల్స్‌‌‌‌

మారనున్న కొన్ని క్రెడిట్ కార్డ్ రూల్స్‌‌‌‌

న్యూఢిల్లీ :  ఎస్‌‌‌‌బీఐ కార్డ్‌‌‌‌, ఐసీఐసీఐ బ్యాంక్‌‌‌‌, యెస్ బ్యాంక్‌‌‌‌  కొన్ని  క్రెడిట్ కార్డు రూల్స్‌‌‌‌ను వచ్చే నెల 1 నుంచి మార్చనున్నాయి.  రెంట్ పేమెంట్ ట్రాన్సాక్షన్లపై రివార్డ్ పాయింట్లను ఎస్‌‌‌‌బీఐ క్రెడిట్ కార్డ్ ఇక నుంచి ఇవ్వదు. అరమ్‌‌‌‌, ఎస్‌‌‌‌బీఐ కార్డ్ ఎలైట్‌‌‌‌, ఎలైట్‌‌‌‌ అడ్వాంటేజ్‌‌‌‌, పల్స్‌‌‌‌, సింప్లీక్లిక్‌‌‌‌ వంటి కార్డులకు ఈ కొత్త రూల్ వర్తిస్తుంది.  ఒక క్వార్టర్‌‌‌‌‌‌‌‌లో రూ.10 వేలు లేదా అంతకంటే ఎక్కువ ఖర్చు చేస్తే  ఎయిర్‌‌‌‌‌‌‌‌పోర్ట్ లాంజ్‌‌‌‌ను వాడుకునే అవకాశాన్ని యెస్ బ్యాంక్ అందించనుంది. ఒక క్వార్టర్‌‌‌‌‌‌‌‌లో (క్యాలెండర్‌‌‌‌‌‌‌‌ ఇయర్‌‌‌‌‌‌‌‌) రూ.35 వేల కంటే ఎక్కువ ఖర్చు చేస్తేనే ఎయిర్‌‌‌‌‌‌‌‌పోర్ట్ లాంజ్ యాక్సెస్‌‌‌‌ ఉంటుందని ఐసీఐసీఐ బ్యాంక్ తన వెబ్‌‌‌‌సైట్‌‌‌‌లో పేర్కొంది.