బ్రౌన్‌ రైస్‌.. వైట్‌రైస్‌ ఏది మంచిది?

బ్రౌన్‌ రైస్‌.. వైట్‌రైస్‌ ఏది మంచిది?

ఈమధ్య చాలామంది వైట్‌‌రైస్‌‌ బదులు బ్రౌన్‌‌రైస్‌‌ తింటున్నారు. ఇది హెల్త్‌‌కు మంచిదని ఎక్కువ మంది నమ్ముతున్నారు. అయితే పూర్తిగా బ్రౌన్‌‌ రైస్‌‌ ఒక్కటే తినడం మంచిది కాదని, దీనితోపాటు రెగ్యులర్‌‌‌‌గా వైట్‌‌రైస్‌‌ కూడా తినాలని కొందరు ఎక్స్‌‌పర్ట్స్‌‌ చెప్తున్నారు. బ్రౌన్‌‌ రైస్‌‌ వల్ల కొన్ని సమస్యలు కూడా రావొచ్చంటున్నారు.

వైట్‌‌రైస్‌‌లో న్యూట్రియెంట్స్‌‌తోపాటు, యాంటీ న్యూట్రియెంట్‌‌ లక్షణాలు కూడా ఉంటాయి.    వైట్‌‌రైస్‌‌తో పోలిస్తే, బ్రౌన్‌‌రైస్‌‌లో 80 శాతం ఎక్కువగా ఆర్సెనిక్‌‌ అనే మెటల్‌‌ ఉంటుంది. ఇది బాడీలో టాక్సిసిటీని పెంచుతుంది.

పైన పొట్టు ఉండే బ్రౌన్‌‌రైస్‌‌ వంటివి కొందరికి త్వరగా అరగకపోవచ్చు.  ముఖ్యంగా సెన్సిటివ్‌‌ డైజెషన్‌‌ ఇష్యూస్‌‌ ఉన్న వాళ్లకు ఇవి పడకపోవచ్చు. పైపొరలో ఫైటిక్‌‌ యాసిడ్‌‌ ఉంటుంది. ఇది యాంటీ న్యూట్రియెంట్‌‌.

వైట్‌‌రైస్‌‌లో గ్లుటెన్‌‌ ఉండదు. అందువల్ల అలర్జీ సమస్యలు తక్కువగా వస్తాయి.

వైట్‌‌రైస్‌‌ తినడం వల్ల జింక్‌‌ తీసుకునే శక్తి పెరుగుతుంది. తగినంత జింక్‌‌ అందితే, ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. ఇన్ఫెక్షన్స్‌‌ రాకుండా ఉంటాయి.

ఒక కప్పు వైట్‌‌రైస్‌‌లో 0.6 మిల్లీ గ్రామ్స్ మాంగనీస్‌‌ ఉంటుంది. ఇది సెల్‌‌ ఫంక్షనింగ్‌‌ను మెరుగుపరుస్తుంది.

బ్రౌన్‌‌రైస్‌‌తో పోలిస్తే, వైట్‌‌రైస్‌‌ టేస్ట్‌‌ చాలా బాగుంటుంది. న్యూట్రియెంట్స్‌‌లో కొన్ని తేడాలున్నా, రెండింటిలోనూ పోషకాలున్నాయి కాబట్టి, వైట్‌‌రైస్‌‌ను కూడా తీసుకోవచ్చు.