ఈ పండ్లను ఫ్రిజ్‌లో పెడితే విషం .. ఫుడ్ పాయిజన్ అయ్యే ప్రమాదం

ఈ పండ్లను ఫ్రిజ్‌లో పెడితే విషం .. ఫుడ్ పాయిజన్ అయ్యే ప్రమాదం

వేసవి కాలం వచ్చేసింది బయట మండుటెండల మధ్య గడిపి ఇంటికి వస్తే తప్పని సరిగా ఫ్రిజ్ లో పెట్టిన చల్లటి నీళ్లు తాగితేనే ప్రశాంతంగా ఉంటుంది.వేసవి లో చాలా మంది కి ఫ్రిజ్ యొక్క అవసరం ఎక్కువగా ఉంటుంది. అయితే కొన్ని పదార్దాలు ఫ్రిజ్​ లో ఉన్నవి . కొన్ని తింటే  అవి విషంగా మారుతాయి. మన ఆహార పదార్థాలను , కూరగాయలని మరియు నీళ్లు పాలు పెరుగు, పండ్లు  వంటివి చెడిపోకుండా ఉండేందుకు చల్లబడేందుకు ఫ్రిజ్ లో పెడతాం.అయితే కొన్ని కూరగాయలు ఆహార పదార్థాలు మరి కొన్నింటిని ఫ్రిజ్ లో అసలు ఉంచకూడదు . ఫ్రిజ్‌లో కొన్ని తాజా పండ్లను నిల్వ చేయడం ఆరోగ్యానికి చాలా హానికరం వాటి వల్ల ఆరోగ్య సమస్యలు రావచ్చు అవేంటో తెలుసుకుందాం.

1. పుచ్చకాయను, ఫ్రిజ్‌లో అస్సలు ఉంచకూడదు. ఇది విని మీలో చాలా మంది షాక్ అయ్యి ఉంటారు. . పుచ్చకాయను ఫ్రిజ్‌లో ఉంచడం ద్వారా, దానిలోని పోషకాలు  నెమ్మదిగా తగ్గుతాయి. దీన్ని కట్ చేసి ఫ్రిజ్‌లో ఉంచితే ఫుడ్ పాయిజన్ అయ్యే ప్రమాదం కూడా ఉంది. ఎందుకంటే కోసిన పుచ్చకాయలో బ్యాక్టీరియా పెరగడం మొదలవుతుంది, ఇవి మన శరీరానికి హాని చేస్తాయి..

2.  అరటిపండ్లు, జామ, కివీస్, మామిడి, సీతాఫలాలు, బొప్పాయి, ప్యాషన్ ఫ్రూట్స్, పీచెస్, బేరి, ఖర్జూరం, రేగు పండ్లను కూడా ఫ్రిజ్‌లో ఉంచకూడదు. ఎందుకంటే అవి నిరంతరం పండే ప్రక్రియలో ఉంటాయి. ఫ్రిజ్‌లో ఉంచితే  వెంటనే వాటిలోని బలమైన పోషకాలు  మాయమవుతాయి. ఫ్రిజ్‌లో ఎక్కువసేపు నిల్వ ఉంచితే అందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు కూడా తగ్గుతాయి.

3. నిమ్మ,  నారింజ కాయలలో ఆమ్లం పుష్కలంగా ఉంటుంది. ఫ్రిజ్‌లోని చల్లదనాన్ని ఈ పండ్లు తట్టుకోలేవు.  వాటిని ఫ్రిజ్‌లో ఉంచిన వెంటనే, వాటిలోని పోషకాలు క్షీణిస్తాయి. అంతేకాదు వాటి రుచి కూడా మారి హాని కలిగించే అవకాశం కూడా ఉంటుంది. నిమ్మ, నారింజ పండ్లను బయట ఉంచితే మూడు నాలుగు రోజుల వరకు చెడిపోవు. 

4..ఉల్లిపాయలు మనం వంటకి సరిపోయే దానికన్నా ఎక్కువ మొత్తంలో ఉల్లిపాయలు కోయడం ద్వారా వాటిని మళ్ళీ వంట చేయడానికి ఉపయోగించాలని వాటిని ఫ్రిడ్జ్ లో ఉంచుతాం. దానివల్ల  ఉల్లిపాయల వాసనతో ఫ్రిజ్ లో ఉండే ఇతర ఆహార పదార్థాల పైన ప్రభావం ఉంటుంది , తరిగిన ఉల్లిపాయలను ఫ్రిజ్ లో పెట్టకుండా ఉండడమే బెటర్.


5.బంగాళాదుంపలను చల్లటి ప్రదేశంలో లేదా ఫ్రిజ్ లో ఉంచడం వల్ల అందులో చెక్కర శాతం ఎక్కువగా పెడుగుతుంది.దీనివల్ల కూరలో రుచి అనేది మారుతుంది.వీటిని వంటరూమ్ లోనే ఉంచుకోవడం బెటర్.

6. ఎన్ని సంవత్సరాలైన చెడిపోని  పదార్థం తేనె , దీనిని ఫ్రిజ్ లో అసలు ఉంచకూడదు.   దానివల్ల తేనె యొక్క రుచి మారుతుంది.తేనెని అల్మారాలో లేక ఇంట్లో భద్రమైన ప్రదేశంలో పెట్టుకోవాలి.

7.పువ్వులను  అసలు ఫ్రిజ్ లో పెట్టకూడదు , వీటి వాసన వల్ల ఫ్రిజ్ లో ఉండే ఇతర ఆహారాల పైన ప్రభావం పడుతుంది, ఆ పూల వాసనతో ఇతర ఆహారాలని మనం తినలేం.

7.పచ్చళ్ళుకాలానికి తగ్గట్లు తెలుగు వారు పచ్చళ్ళు పెడతారు ఇవి చెడి పోకుండా ఉండటానికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఫ్రిజ్ లో పచ్చళ్ళు పెట్టడం ద్వారా ఆ చల్లదనానికి  త్వరగా చెడిపోతాయి.

8. బ్రెడ్ పాకెట్ ఓపెన్ చేసాక మిగిలి పోయినది ఫ్రిజ్ లో పెడతాం .దీనివల్ల బ్రెడ్ గట్టిపడి తినలేని స్థితికి వస్తాయి.అందువల్ల కవర్ మూసిపెట్టాలి.