ఫాంహౌస్ కేసులో ఎమ్మెల్యేల్లో కొందరిపై డ్రగ్స్ ఆరోపణలు : బండి సంజయ్

ఫాంహౌస్ కేసులో  ఎమ్మెల్యేల్లో కొందరిపై డ్రగ్స్ ఆరోపణలు : బండి సంజయ్

ఫాంహౌస్ కేసులో ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యేల్లో కొందరిపై డ్రగ్స్ ఆరోపణలున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ అన్నారు. డ్రగ్స్ కేసులో ఉన్న వారి గురించి తెలుసుకునేందుకు బెంగళూరుకు లీగల్ టీంను పంపించినట్లు చెప్పారు. లీగల్ టీం వెళ్లగానే హడావుడిగా రోహిత్ రెడ్డి స్టేట్మెంట్ రికార్డు చేశారని తెలిపారు. బీఆర్ఎస్ అనేది ఓ వైరస్ అయితే బీజేపీ ఓ వ్యాక్సిన్ అని..ప్రజలు వాక్సిన్నే కోరుకుంటారని అన్నారు.

తన పాదయాత్రకు ప్రజల నుంచి బ్రహ్మాండమైన స్పందన వస్తోందని బండి సంజయ్ తెలిపారు. రోజులో 18 గంటల పాటు దేశం కోసం పనిచేస్తున్న మోడీ స్ఫూర్తితో పాదయాత్ర చేస్తున్నట్లు తెలిపారు. క్షేత్ర స్థాయిలో ప్రజలను కలిసి వారి సమస్యలు తెలుసుకునేందుకే ఈ యాత్ర చేపట్టినట్లు వివరించారు. కొన్ని పార్టీలు ఏసీ రూముల్లో కూర్చుని పార్టీ ఎజెండాలు తయారు చేస్తున్నారని.. కానీ తాము జనాల్లో తిరిగి వారి సమస్యల పరిష్కారం కోసం ఎజెండా తయారు చేస్తున్నట్లు తెలిపారు. 

ఇప్పటి వరకు జరిగిన ప్రజాసంగ్రామ సభలన్నీ సక్సెస్ అయ్యాయని.. గురువారం జరిగే సభ కూడా విజయవంతమవుతుందని తెలిపారు. బీఆర్ఎస్ ఆఫీసులు ఓపెన్ చేయడం కాదు... ప్రజల సమస్యలు తెలుసుకుని పరిష్కరిస్తే ఆ పార్టీని స్వాగతిస్తామని తెలిపారు.