ఓయూ, వెలుగు: జూబ్లీహిల్స్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి నవీన్ యాదవ్ పై కొంతమంది పనిగట్టుకుని దుష్ప్రచారం చేస్తూన్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి జాజుల లింగంగౌడ్ కోరారు. సోమవారం ఓయూ ఏసీపీ జగన్ ను కలిసి వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పార్టీలకతీతంగా బీసీ నాయకుడు నవీన్ యాదవ్ కు వస్తున్న ఆదరణను చూసి తట్టుకోలేక, సోషల్ మీడియాలో తప్పుడు రాతలతో ఆయన ఇమేజ్ను దెబ్బతీస్తున్నారని ఆరోపించారు. అలాంటి వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో విద్యార్థి జేఏసీ చైర్మన్ సైదులు, బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వీరబోయిన లింగయ్యయాదవ్, అశోక్, శ్రీనివాస్ పాల్గొన్నారు.
