మన వల్ల ప్రకృతికి హాని.. వైల్డ్‌‌లైఫ్లో ఎన్నో ఎమోషన్స్!

మన వల్ల ప్రకృతికి హాని..  వైల్డ్‌‌లైఫ్లో ఎన్నో ఎమోషన్స్!

నేచర్ ఫొటోగ్రఫీ కాంటెస్ట్‌‌ కోసం వేలాది ఎంట్రీలు వచ్చాయి. కాంటెస్ట్‌‌ కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎంతోమంది ఫొటోగ్రాఫర్లు అపూర్వమైన ప్రకృతి అందాలను క్యాప్చర్‌‌‌‌ చేశారు.  ప్రకృతి మనకు ఇస్తున్న సందేశాలను, మన వల్ల ప్రకృతికి ఏర్పడుతున్న హానిని కూడా కెమెరాల్లో బంధించారు. వాటిలో కొన్ని ఫొటోలు ఇవి.. 

సీట్‌‌బెల్ట్ చెక్: ఫన్నీ నేచర్ ఫైనలిస్ట్ ఫొటో ఇది. కెన్యాలోని మసాయి మారాలో సఫారీలో ఉన్నప్పుడు గ్రేమ్ గై ఈ ఫొటో తీశాడు. తన బిడ్డతో ఉన్న ఒక ఆడ జిరాఫీని ఫొటో తీస్తుండగా అటువైపు నుంచి ఒక విమానం వెళ్లింది. దాంతో ఇలా జిరాఫీ ఫ్లైట్‌‌లో ఉన్న ప్యాసింజర్లు సీట్‌‌ బెల్ట్‌‌ పెట్టుకున్నారా? లేదా? అని చెక్‌‌ చేస్తున్నట్టు కనిపిస్తోంది. 

బ్రిటిష్ కొలంబియాలోని ఖుట్జీమటీన్‌‌లో ఒక ఆడ ఎలుగుబంటి హాయిగా గడ్డి తింటుండగా, దానితో ఎవరు జత కట్టాలనేది నిర్ణయించుకోవడానికి రెండు మగ ఎలుగుబంట్లు పోరాడుతుండగా ఫొటోగ్రాఫర్‌‌ జిల్ హిల్ కెమెరాకు చిక్కాయి. 

ఒక చిన్న సీగల్ పక్షి ‘ఫాలోమీ’ అనగానే  వినయంగా దాని వెంటే వెళ్తున్న భారీ ఎలుగుబంటిని జానెట్ గాస్టిన్ క్లిక్‌మనిపించాడు.

ఇవి దూసుకొస్తున్న రాకెట్లు కాదు.. సముద్రంలో ఈదుతున్న మొబులాలు. వీటిని బింగ్‌‌కియాన్ గావో క్యాప్చర్​ చేశాడు.