అనుమతులు లేకుండానే వందల ప్రైవేట్ స్కూల్స్

అనుమతులు లేకుండానే వందల ప్రైవేట్ స్కూల్స్

హైదరాబాద్, వెలుగు: ప్రభుత్వ అనుమతులు లేకుండానే కొన్ని రెసిడెన్షియల్ స్కూల్స్​కొనసాగుతున్నాయి. పేరెంట్స్​కు కట్టుకథలు చెప్పి లక్షల్లో ఫీజులు వసూల్ చేస్తూ అకాడమిక్ ఇయర్ ని కంప్లీట్ చేస్తున్నాయి. అడ్మిషన్ సమయంలో ఎన్నో మాయమాటలు చెప్పి చివరకు చేతులెత్తేస్తున్నాయి. కొన్నిస్కూల్స్​యాజమాన్యాలైతే సీబీఎస్​ఈ పేరుతో అడ్మిషన్స్​తీసుకొంటుండగా.. వాటికి స్టేట్ బోర్డు పర్మిషన్స్ కూడా ఉండటంలేదు. ఇలాంటి స్కూల్స్​పై చర్యలు తీసుకుంటామని చెబుతున్న విద్యాశాఖ అధికారులు పెద్దగా పట్టించుకోవడంలేదు. దీంతో అనుమతులు లేకుండానే వందలాది స్కూల్స్​అకాడమిక్ ఇయర్ ని విజయవంతంగా పూర్తి చేశాయి. రెసిడెన్షియల్ స్కూల్స్ యాజమాన్యాలు సైతం ఈ తరహాలో మోసాలు చేస్తున్నాయి.గుట్టుచప్పుడు కాకుండా లోపల క్యాంపస్ లు ఏర్పాటు చేసుకొని కొనసాగుతున్నాయి. 

అంతటా ఇంతే..

విద్యాశాఖ అనుమతులు లేకుండానే రాష్ట్రంలో వందలాది ప్రైవేట్ స్కూల్స్​నడుస్తున్నాయి. స్కూళ్లలో ఏదైనా ఘటనలు జరిగితే తప్ప వీటి ప్రస్తావన ఎవరూ ఎత్తడంలేదు.సంఘటన జరిగినప్పుడే సమాచారం సేకరించే విద్యాశాఖ ఉన్నతాధికారులు ఆ తరువాత పట్టించుకోవడంలేదు. కొన్ని స్కూల్స్ రెన్యూవల్ చేసుకోకపోగా, అనుమతులు లేకుండా కొత్తగా వందలాది స్కూల్స్​పుట్టుకొస్తున్నాయి. దీంతో సర్కారు ఆదాయానికి కూడా  కోట్లలో గండిపడుతోంది. అనుమతులు లేని స్కూల్స్ ఇచ్చే టీసీలు చెల్లకపోవడంతో అక్కడి టెన్త్ క్లాస్ స్టూడెంట్లు ఫైనల్​ఎగ్జామ్స్​ను వేరే స్కూళ్ల​పేరుతో రాయాల్సి వస్తోంది. ఇలాంటి స్కూల్స్​సంగారెడ్డి జిల్లాలోనే ఎక్కువగా ఉన్నట్లు తెలిసింది. 

ఒక్కసారి తీసుకుంటే పదేళ్లపాటు

కొత్తగా స్కూల్స్​ని ఏర్పాటు చేయాలంటే ముందుగా తనిఖీ ఫీజు, డిపాజిట్ తదితరాలకు స్కూల్ ప్రాంగణం విస్తీర్ణాన్ని బట్టి రూ.లక్ష నుంచి రెండు లక్షల వరకు ప్రభుత్వ శాఖలకు ఫీజు చెల్లించాలి. ఫైర్ డిపార్ట్​మెంట్ ఎన్ఎస్సీ, పోలీసుల క్లియరెన్స్, శానిటరీ సర్టిఫికెట్, స్కూల్ భవనం పటిష్టత సర్టిఫికెట్లు పొందాల్సి ఉంటుంది. ఒకసారి అనుమతి పొందితే పదేళ్ల వరకు గడువు ఉంటుంది. విద్యా హక్కు చట్టం ప్రకారం గుర్తింపు లేని స్కూల్స్ యాజమాన్యానికి లక్షల్లో ఫైన్లు వేసే అధికారం సంబంధిత అధికారులకు ఉంది.


లక్షా60 వేలు కట్టించుకున్నరు

మంచిగుందని కొందరు చెబితే మా అబ్బాయిని పఠాన్ చెరులోని రెసోనెన్స్ రెసిడెన్షియల్​స్కూల్ లో అడ్మిట్ చేశాను. ఇక్కడ స్టడీ కరెక్ట్​గా లేదు. అడ్మిషన్ సమయంలో చెప్పిన మెనూ ప్రకారం పిల్లలకు ఫుడ్ పెట్టలేదు. ఫీజు లక్షా 80 వేలు చెప్తే లక్షా 60 వేలు కట్టిన. ముందు సీబీఎస్​సీ సిలబస్​అని చెప్పి తర్వాత పర్మిషన్ రాలేదని స్టేట్ సిలబస్ అన్నరు. దానికి కనీసం స్టేట్ బోర్డు పర్మిషన్ కూడా లేదు. పిల్లల జీవితాలతో ఆడుకుంటున్న ఇలాంటి యాజమాన్యాలపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలె. - సమర్థరాజ్, పేరెంట్, సంగారెడ్డి

ప్రభుత్వం పట్టించుకోకపోవడంతోనే ఈ దుస్థితి..

డీఈఓలు, డిప్యూటీ ఈవోలు గ్రౌండ్ లేవల్లో తనిఖీలు చేయకపోవడంతో అనుమతులు లేని స్కూల్స్ బయట పడటంలేదు. హాల్ టికెట్లు ఇచ్చే సమయంలో బయటపడుతున్నాయి. దీంతో స్టూడెంట్స్, వారి పేరెంట్స్ ఆందోళన చెందుతున్నారు. వందలాది స్కూల్స్ అనుమతులు లేకుండా కొనసాగుతున్నా విద్యాశాఖ అధికారులు పట్టించుకోవడం లేదు. - కమల్ సురేశ్, ఏబీవీపీ స్టేట్ జాయింట్ సెక్రటరీ