పిల్లలు శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండాలంటే కొన్ని టిప్స్​

పిల్లలు శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండాలంటే కొన్ని టిప్స్​

ఒత్తిడి నుంచి పిల్లల్ని దూరంగా ఉంచేందుకు మెడిటేషన్​ బెస్ట్​ మెడిసిన్​. ప్రతి రోజూ  ఉదయం లేదా సాయంత్రం ఓ పావుగంట వాళ్లతో మెడిటేషన్​ చేయించాలి. వయసుకు తగిన ఎక్సర్​సైజ్​లు చేయించాలి. ఇవేమీ వద్దనుకుంటే.. మొక్కలకి నీళ్లు పట్టించడం లాంటివి చేయించినా ఒకే. పిల్లలు టీవీ లేదా స్మార్ట్‌‌‌‌ఫోన్‌‌‌‌ ముందు కూర్చునే టైం తగ్గించాలి. ఆ టైంలో బయట ఆడుకోనివ్వాలి. కథలు చెప్పాలి.  పెయింటింగ్​, క్రాఫ్ట్స్​ లాంటివి చేయించాలి. ఇలా చేయడం వల్ల  వాళ్ల మానసిక ఆరోగ్యం బాగుంటుంది. ఎప్పుడూ చదువు, స్కూల్‌‌‌‌, ట్యూషన్‌‌‌‌... అనే కాకుండా సెలవు రోజుల్లో పిల్లల్ని బయటికి తీసుకెళ్లాలి. వాళ్లతో సరదాగా పాటలు పాడిస్తూ ఆడించాలి. బయటి ప్రపంచాన్ని  పరిచయం చేయాలి.

దీనివల్ల పిల్లలు ఏదైనా సమస్యొచ్చినా స్ట్రెస్​ ఫీలవ్వకుండా.. పేరెంట్స్​తో షేర్​చేసుకుంటారు. ఇంట్లో, స్కూల్లో  వాతావరణం ఆనందంగా, ఆహ్లాదకరంగా ఉండేలా చూసుకోవాలి. సమస్య ఎలాంటిదైనా కుంగిపోవద్దని చెప్పాలి. పిల్లలకి డైరీ రాయడం అలవాటు చేయాలి.అందులో వాళ్లని సంతోషపెట్టే విషయాలతో పాటు, భయపెట్టేవి, బాధపెట్టేవి కూడా రాయమనాలి. దీనివల్ల పిల్లల్లో పాజిటివిటీ పెరుగుతుంది. పిల్లల్ని ఫ్రెండ్స్​కి ఎంత దగ్గరగా ఉంచితే.. వాళ్లలో ఒత్తిడి అంత తగ్గుతుంది.