తలనొప్పికి చెక్ పెట్టండి!

తలనొప్పికి చెక్ పెట్టండి!

రోజువారి పనులతో చికాకు, తలనొప్పి రావడం కామనే. నిమిషాల్లో తలనొప్పికి చెక్ పెట్టేయండిలా!

  • తలనొప్పికి మన భావోద్వేగాలతో సంబంధం ఉంది. అందుకే.. తలనొప్పి మొదలవగానే.. ఆలోచించడం మానేసి శ్వాస మీద ధ్యాస పెట్టండి.
  • శరీరానికి సరిపడా నీళ్లు అందకపోయినా.. తలనొప్పి మొదలవుతుంది. తలనొప్పికి ఒక గ్లాసు చల్లటి నీళ్లు తాగి చూడండి. తేడా తెలుస్తుంది.
  • కొన్ని మంచుగడ్డలను గుడ్డలో చుట్టి తలచుట్టూ ఆడిస్తే.. క్షణాల్లో తలనొప్పి తగ్గిపోతుంది. లేదంటే.. గోరువెచ్చటినీటితో ముఖం కడుక్కోండి.
  • మాడు, కణతల మీద మృదువుగా మర్దనచేసినా తలనొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది.
  • చిన్న అల్లం ముక్క నోట్లో వేసుకొని చూడండి. తలనొప్పి మటుమాయం అవుతుంది.