పిల్లల కోసం సమ్ థింగ్ స్పెషల్ దీపావళి

పిల్లల కోసం సమ్ థింగ్ స్పెషల్ దీపావళి

పిల్లలు బాగా ఎంజాయ్‌‌ చేసే ఫెస్టివల్స్‌‌లో దీపావళి ఒకటి. దీపాలు వెలిగే ఇంట్లో పిల్లలు చేసే సందడి అంతాఇంతా కాదు. వాళ్లకిష్టమైన క్రాకర్స్‌‌ పేలుస్తూ భలే ఎంజాయ్‌‌ చేస్తారు. అయితే ఈసారి కరోనా వల్ల గతంలో కనిపించినంత దీపావళి సందడి ఇప్పుడు కనిపించడం లేదు. పండుగ జోష్‌‌ కాస్త తగ్గినా, క్రాకర్స్‌‌ ఎక్కువగా కాల్చకపోయినా, పిల్లల్ని మరో రకంగా హ్యాపీగా ఉంచొచ్చు. చిన్నారుల్లోని క్రియేటివిటీని బయటకు తెచ్చి, ఈ పండుగను వాళ్లకు స్పెషల్‌‌గా మార్చొచ్చు. కొంచెం ఎఫర్ట్‌‌ పెడితే, సమ్‌‌థింగ్‌‌ స్పెషల్‌‌ దీపావళి అనిపించుకుంటుంది ఈ పండుగ. మరి పిల్లలతో చేయగలిగే కొన్ని ఫన్‌‌ యాక్టివిటీస్‌‌ ఏంటో చూద్దామా…

మార్కెట్లో దొరికే రకరకాల క్యాండిల్స్, ఎలక్ట్రిక్‌‌ లైట్స్‌‌తో డెకొరేట్‌‌ చేస్తారు. అయితే ఇలా ఎప్పుడూ బయట తయారు చేసినవే కాకుండా, ఇంట్లో పిల్లలతో కొన్ని ఐటమ్స్‌‌ తయారు చేయించొచ్చు. కాస్త ఖాళీ టైమ్‌‌ దొరికితే కిడ్స్‌‌తో మంచి ఐటమ్స్‌‌ రెడీ చేయించొచ్చు. దీనికి కావాల్సిందల్లా పిల్లల్లో ఉత్సాహం. క్రియేటివిటీ! పేరెంట్స్ ఎంకరేజ్‌‌మెంట్‌‌. అంతే! ఇంట్లో పిల్లలు తయారు చేసిన క్రాఫ్ట్స్‌‌ అండ్‌‌ డెకొరేటివ్‌‌ ఐటమ్స్‌‌ రెడీ.

పేపర్‌‌‌‌ లీఫ్‌‌ గార్లాండ్‌‌

రంగురంగుల కాగితాలతో ఆకుల్లాగ తయారు చేసిన వాటిని డెకొరేట్‌‌ చేస్తే బాగుంటుంది. ఇది చేయడం చాలా సింపుల్‌‌. దీనికి కావాల్సినవి ప్రింటబుల్‌‌ లీఫ్‌‌ టెంప్లెట్‌‌. ఇది లేకపోతే, చిన్న సైజ్‌‌లో ఉండే ఒక ఆకు తీసుకుని దాని సైజ్‌‌లో పేపర్స్‌‌ కట్‌‌ చేయాలి. కార్డ్‌‌స్టాక్‌‌ పేపర్స్‌‌ (డిఫరెంట్‌‌ కలర్స్‌‌). సిజర్స్‌‌‌‌, గ్లిట్టర్‌‌‌‌ జెల్‌‌ పెన్‌‌, ట్వైన్‌‌ (గట్టిగా ఉండే దారం), హోల్‌‌ పంచ్‌‌.

తయారీ: మందంగా ఉండే కార్డ్‌‌స్టాక్‌‌ పేపర్స్‌‌ను ప్రింటబుల్‌‌ లీఫ్‌‌ లేదా కావాల్సిన ఆకు సైజ్‌‌లో కట్‌‌ చేయాలి. ఈ ఆకులపై జెల్‌‌ పెన్‌‌తో గీతల్లాగ ఆకు మధ్యలో, పక్కన సిరలు గీయాలి. ఆకు పై భాగంలో హోల్‌‌ పంచ్‌‌తో చిన్న హోల్స్‌‌ చేయాలి. ఈ హోల్స్‌‌ మధ్యలోంచి దారాన్ని గుచ్చి, అన్ని ఆకుల్ని కలపాలి. అయితే ఒక కలర్‌‌‌‌ ఆకు పక్కన మరో కలర్‌‌‌‌ ఆకు వచ్చేలా చూడాలి. ఇలా అన్ని రంగులు అయిపోయాక ఆ దారపు కొసల్ని కావాల్సిన చోట కట్టొచ్చు. లేదా గ్లూతో గోడకు అతికించొచ్చు. రంగురంగుల పేపర్‌‌‌‌ లీవ్స్‌‌ చూడగానే ఆకట్టుకుంటాయి. దీపావళి వెలుగుల్లో ఈ ఆకులు మెరుస్తూ ఇంటికి కొత్త కాంతి తీసుకొస్తాయి. అయితే ఒకే సైజ్‌‌, ఒకే కలర్‌‌‌‌, ఒకే డిజైన్‌‌ ఆకుల్నే ఫాలో అవ్వక్కర్లేదు. పిల్లల క్రియేటివిటీని బట్టి రకరకాల డిజైన్స్‌‌ ట్రై చేయొచ్చు.

పేపర్‌‌‌‌ లాంతర్‌‌‌‌

ఈ రోజుల్లో చాలా కామన్‌‌గా దొరుకుతున్న డెకొరేటివ్‌‌ ఐటమ్‌‌ పేపర్‌‌‌‌ లాంతర్‌‌‌‌. మార్కెట్లో రకరకాల డిజైన్స్‌‌లో పేపర్‌‌‌‌ లాంతర్స్‌‌ దొరుకుతున్నాయి. కానీ, వీటిని పిల్లలు కూడా ఇంట్లోనే ఈజీగా తయారు చేయొచ్చు. దీనికి కలర్‌‌‌‌ఫుల్‌‌ పేపర్స్‌‌, హోల్‌‌ పంచ్‌‌, గ్లూ, సిజర్‌‌‌‌ కావాలి. ముందుగా పేపర్స్‌‌ను మధ్యలో సగానికి మడిచి, రెండు వైపులా చివర్లో ఒక అంగుళం వరకు వదిలేసి మధ్యలో అర అంగుళం దూరంలో, పొడవుగా కట్‌‌ చేయాలి. పేపర్‌‌‌‌ పై భాగంలో కూడా ఒక అంగుళం వదలాలి. ఇలా కట్‌‌ చేసుకున్న పేపర్‌‌‌‌పై హోల్‌‌ పంచ్‌‌తో ఇష్టమైన చోట హోల్స్‌‌చేయాలి. ఇప్పుడు కట్‌‌ చేసుకున్న పేపర్స్‌‌ను వృత్తంగా చుట్టి, గ్లూతో రెండు చివర్లు అతికించాలి. వీటిని కట్‌‌ చేసిన చోట, సగం నుంచి కొంచెం మడిస్తే చాలు. పేపర్‌‌‌‌ లాంతర్‌‌‌‌ రెడీ అవుతుంది. ఈ పేపర్స్‌‌ను నేలపై ఉంచి, మధ్యలో టీ క్యాండిల్స్‌‌ పెడితే కలర్‌‌‌‌ఫుల్‌‌గా మెరుస్తుంటాయి.

బ్యాంగిల్‌‌ దియాస్‌‌

వాడని చేతి గాజులు ఉంటే వాటితో బ్యాంగిల్‌‌ దియాస్‌‌ తయారు చేయొచ్చు. దీనికి ఒకే సైజ్‌‌లో ఉండే గాజులు, గ్లూ, టీ క్యాండిల్‌‌, అట్టముక్క ఉంటే చాలు. గాజులను వరుసగా ఒకదానిపై ఒకటి కలుపుతూ, గ్లూతో అతికించాలి. వీటిని అట్టముక్కపై అతికించాలి. మధ్యలో టీ క్యాండిల్‌‌ వెలిగిస్తే, రాత్రిపూట కలర్‌‌‌‌ఫుల్‌‌గా కనిపిస్తుంది. డిఫరెంట్‌‌ కలర్స్‌‌లో మెరిసే గాజుల మధ్య ఉండే దీపం చూడగానే ఆకట్టుకుంటుంది. మీ టేస్ట్‌‌ను బట్టి పిల్లలతో కావాల్సినన్ని బ్యాంగిల్‌‌ దియాస్‌‌ తయారు చేయించొచ్చు.