బండరాయితో కొట్టి తండ్రి హత్య ..మేడ్చల్లో ఘటన.. నిందితుడు అరెస్ట్

బండరాయితో కొట్టి తండ్రి హత్య ..మేడ్చల్లో ఘటన.. నిందితుడు అరెస్ట్

మేడ్చల్, వెలుగు: తండ్రిని కొడుకు హత్య చేసిన ఘటన మేడ్చల్​ పోలీస్​ స్టేషన్​ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సిద్దిపేట జిల్లా ములుగు మండలం అచ్చాయిపల్లి గ్రామానికి చెందిన నిజాముద్దీన్(35), కొడుకు షేక్‌‌‌‌ సాతక్‌‌‌‌ కలిసి మంగళవారం రాత్రి మోపెడ్​పై శామీర్‌‌‌‌పేట వైపు వస్తున్నారు. 

మార్గమధ్యలో తుర్కపల్లిలోని యాడారం ప్రజయ్‌‌‌‌ హోమ్స్ వద్ద అర్ధరాత్రి తండ్రీకొడుకులతో పాటు సాతక్‌‌‌‌ ఫ్రెండ్​ రాజు కలిసి మద్యం సేవించారు. ఈ సమయంలో తండ్రీకొడుకుల మధ్య వాగ్వాదం జరిగింది. మద్యం మత్తులో ఉన్న సాతక్.. తండ్రి నిజాముద్దీన్‌‌‌‌ను బండరాయితో కొట్టి హత్య చేశాడు. పోలీసులు సాతక్​తో పాటు అతడి ఫ్రెండ్​ రాజును అదుపులోకి తీసుకున్నారు. ఈ హత్యకు గల కారణాలు తెలియరాలేదు.