అత్తింట్లో అల్లుడు చోరీ

అత్తింట్లో అల్లుడు చోరీ

ఓయూ, వెలుగు: అత్త తీర్థయాత్రలకు వెళ్లొచ్చేలోగా ఆమె ఇంట్లోని బంగారం, డబ్బును తీసుకుని అల్లుడు పారిపోయిన ఘటన ఓయూ పీఎస్ పరిధిలో జరిగింది. మాణికేశ్వరీనగర్​లో ఉండే రంగమ్మ దగ్గర వారసత్వంగా వచ్చిన 110 తులాల బంగారు నగలు ఉన్నాయి. దుర్గా అనే అమ్మాయిని రంగమ్మ దత్తత తీసుకుని ఐదేండ్ల క్రితం స్థానిక యువకుడు లక్ష్మణ్(30)కి ఇచ్చి పెళ్లి చేసింది.  దుర్గ,లక్ష్మణ్​ దంపతులు రంగమ్మ దగ్గరే ఉంటున్నారు. వారం క్రితం కాశీకి వెళ్లిన రంగమ్మ మంగళవారం తిరిగి ఇంటికి వచ్చింది.  లాకర్​ తెరిచి ఉండటంతో కంగారు పడిన ఆమె లోపల చూడగా.. అందులో దాచిన బంగారం, రూ.4 లక్షలు కనిపించలేదు. దీంతో ఆమె వెంటనే  ఓయూ పోలీసులకు కంప్లయింట్ చేసింది. కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు లక్ష్మణ్ పై అనుమానంతో అతడిని విచారించారు. తానే చోరీ చేసినట్లు విచారణలో లక్ష్మణ్​ ఒప్పుకున్నాడు. రంగమ్మ ఇంట్లోని సీసీ కెమెరాల వైర్లను లక్ష్మణ్ కట్ చేసి.. లాకర్ లోని బంగారం, క్యాష్ ను ఎత్తుకెళ్లినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడి దగ్గరి నుంచి కొంత క్యాష్, బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు అల్లుడే ఈ చోరీ చేసినట్లు తేలడంతో రంగమ్మ కేసు వాపస్ తీసుకునేందుకు పోలీసులను సంప్రదించినట్లు సమాచారం.