మద్యానికి డబ్బులు ఇవ్వలేదని.. తండ్రిని హత్య చేసిన కొడుకు

మద్యానికి డబ్బులు ఇవ్వలేదని.. తండ్రిని హత్య చేసిన కొడుకు
  • మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలో ఘటన

జన్నారం, వెలుగు: మద్యం తాగేందుకు డబ్బులు ఇవ్వలేదనే కోపంతో కన్న తండ్రిని కొడుకు హత్య చేశాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మంచిర్యాల జిల్లా జన్నారం గ్రామపంచాయతీ పరిధిలోని సేవదాస్ నగర్​కు చెందిన జాదవ్  శంకర్ నాయక్(58)కి ముగ్గురు కూతుళ్లు, ఒక కొడుకు ఉండగా, భార్య రెండేండ్ల కింద చనిపోయింది. కొడుకు నూర్​సింగ్  మద్యానికి బానిస కావడంతో రెండేండ్ల కింద భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. 

అప్పటి నుంచి తండ్రి శంకర్ నాయక్ తో మద్యం కోసం డబ్బులు ఇవ్వాలని గొడవ పడేవాడు. ఈక్రమంలో శనివారం శంకర్ నాయక్  ఇంట్లో రొట్టెలు చేసుకుంటుండగా, నూర్​సింగ్  మద్యం మత్తులో  రోకలిబండతో తలపై కొట్టాడు. తీవ్ర రక్తస్రావమై శంకర్​నాయక్​ అక్కడిక్కడే చనిపోయాడు. ఘటనా స్థలాన్ని లక్సెట్టిపేట సీఐ రమణమూర్తి సందర్శించి వివరాలు సేకరించారు. 

మృతుడి కూతురు జ్యోతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.