
సుధీర్ బాబు, సోనాక్షి సిన్హా లీడ్ రోల్స్‌లో రూపొందుతున్న సూపర్ నేచురల్ మైథలాజికల్ థ్రిల్లర్ ‘జటాధర’. తెలుగు, హిందీ భాషల్లో రూపొందుతున్న ఈ పాన్-ఇండియా చిత్రానికి వెంకట్ కళ్యాణ్, అభిషేక్ జైస్వాల్ దర్శకత్వం వహించారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ఫస్ట్ సాంగ్‌కు పాజిటివ్ రెస్పాన్స్ రాగా, విజయదశమి సందర్భంగా ‘ధన పిశాచి’ అనే పాటను విడుదల చేశారు. సమీరా కొప్పికర్ కంపోజ్ చేసిన ఈ పాటను సాహితీ చాగంటి పాడారు.
శ్రీ హర్ష ఈమని రాసిన సాహిత్యం ఆకట్టుకుంది. వీడియో సాంగ్‌లో సోనాక్షి పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్ ఇంప్రెస్ చేసింది. దివ్య ఖోస్లా, శిల్పా శిరోధ్కర్, ఇంద్రకృష్ణ, రవి ప్రకాష్, నవీన్ నేని, రోహిత్ పాఠక్, ఝాన్సీ, రాజీవ్ కనకాల, సుభలేఖ సుధాకర్ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రం నవంబర్ 7న విడుదల కానుంది. జీ స్టూడియోస్, ప్రేరణ అరోరా సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని ఉమేష్ కుమార్ బన్సల్, శివిన్ నారంగ్, అరుణ అగర్వాల్, ప్రేరణ అరోరా, శిల్పా సింగ్‌హల్, నిఖిల్ నందా నిర్మిస్తున్నారు.