సైకలాజికల్ థ్రిల్లర్‌‌తో వస్తున్నా సోనాక్షి సిన్హా .. నికితా రాయ్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

సైకలాజికల్ థ్రిల్లర్‌‌తో వస్తున్నా సోనాక్షి సిన్హా .. నికితా రాయ్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

సుధీర్ బాబు హీరోగా నటిస్తున్న 'జటాధర' చిత్రంతో బాలీవుడ్ హీరోయిన్ సోనాక్షి సిన్హా టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. ఈ పాన్ ఇండియా మూవీలో ఓ పవర్ఫుల్ క్యారెక్టర్ను ఆమె పోషిస్తోంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్లుక్ పోస్టర్లో తన లుక్ సర్సైజ్ చేసింది. మరోవైపు ఆమె 'నికితా రాయ్' అనే హిందీ చిత్రంలో లీడ్ రోల్ చేస్తోంది. అర్జున్ రామ్పాల్, పరేశ్ రావల్, సుహైల్ నయ్యర్ ఇందులో కీలకపాత్రలు పోషిస్తున్నారు. శనివారం ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేశారు. 

అలాగే సినిమా రిలీజ్ డేట్ను కూడా రివీల్ చేశారు. మే 30న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్టు తెలియజేశారు. సోనాక్షి సోదరుడు కుశ్ ఎస్ సిన్హా ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. నిక్కీ భగ్నాని, విక్కీ భగ్నాని నిర్మిస్తున్నారు. మానవ మేదస్సులోని గ్రే జోన్ను ఆవిష్కరించే సైకలాజికల్ థ్రిల్లర్ ఇదని, లండన్ తో పాటు యూకేలోని పలు ప్రదేశాల్లో షూటింగ్ చేశామని చెప్పారు. మెయిన్ స్ట్రీమ్ సినిమాల్లో ఇప్పటివరకూ చూపించని అంశాలతో పవర్ఫుల్ కాస్టింగ్, గ్రిప్పింగ్ నెరేషన్తో తో ఉండబోతోందని తెలిపారు