
తొలి సినిమా ‘దబాంగ్’తోనే ఉత్తమ నటిగా ఫిలిం ఫేర్ అవార్డు కొట్టేసింది సోనాక్షి సిన్హా. ఆ తర్వాత ఆ రేంజ్ హిట్స్ అందుకోలేదు. ఇటీవల వచ్చిన ‘దాహాద్’ వెబ్ సిరీస్‌తో మరోసారి ట్రెండింగ్‌గా మారింది. ఇప్పుడీ బాలీవుడ్ బ్యూటీకి బాయ్ఫ్రెండ్ దొరికేశాడంటూ బీటౌన్‌లో వార్తులు వస్తున్నాయి. ఆమె బర్త్‌డే సందర్భంగా ఓ యువ నటుడు పెట్టిన పోస్టే అందుకు కారణంగా తెలుస్తోంది.
జహీర్ ఇక్బాల్ అనే కో యాక్టర్‌తో సోనాక్షి ప్రేమలో ఉందట. ఈ బ్యూటీ 36వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా ఆమెను విష్ చేస్తూ ఐలవ్ యూ అంటూ తన ఫీలింగ్స్‌ను ఓ నోట్ ద్వారా తెలిపాడు. దీంతో ఇంతకాలం వీరిపై వస్తున్న రూమర్లు నిజమేనని అంతా ఫిక్స్ అయిపోయారు. వీరి ప్రేమ పెళ్లి పీటలవరకూ వెళ్లాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.