
బాలీవుడ్‌లో మొదటి సినిమాకే ఫిల్మ్‌ఫేర్ అవార్డ్ అందుకున్న సోనాలీ బెంద్రే.. టాలీవుడ్‌లో మహేష్ బాబు, చిరంజీవి, బాలకృష్ణ లాంటి స్టార్ హీరోలతో నటించి సూపర్ హిట్స్‌ను ఖాతాలో వేసుకుంది. మంచి మోడల్ కావడంతో ఎన్నో ప్రొడక్ట్స్‌కి బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించింది. చాలా టీవీ షోస్‌కి జడ్జ్‌గానూ వ్యవహరించింది. అయితే క్యాన్సర్ అటాక్ కావడంతో చాన్నాళ్ల పాటు కెమెరాకు దూరంగా ఉండిపోయింది సోనాలి. ఆరోగ్యం కుదుటపడటంతో ఇప్పుడు మళ్లీ కెరీర్‌పై దృష్టి పెడుతోంది. జీ5లో రానున్న ‘ద బ్రోకెన్ న్యూస్’ అనే వెబ్ సిరీస్‌తో డిజిటల్ ఎంట్రీ ఇస్తోంది సోనాలి. ‘అరణ్యక్’ ఫేమ్ వినయ్ వైకుల్ డైరెక్ట్ చేస్తున్నాడు. 2018లో స్ట్రీమ్ అయిన సూపర్ హిట్ బ్రిటిష్ సిరీస్ ‘ప్రెస్’కి ఇది రీమేక్. ఇక సోనాలి తెలుగులోనూ నటించనున్నట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ డైరెక్షన్‌లో రూపొందే చిత్రంలో ఓ కీలక పాత్ర కోసం సోనాలిని తీసుకున్నట్లు టాక్. ఈ నెల 20న ఈ మూవీ సెట్స్‌కి వెళ్లే అవకాశం ఉంది కనుక అప్పుడు సోనాలి పాత్రపై క్లారిటీ రావొచ్చు. ఈ వార్త నిజమైతే మాత్రం పద్దెనిమిదేళ్ల తర్వాత సోనాలి టాలీవుడ్‌లో రీ ఎంట్రీ ఇస్తున్నట్టవుతుంది.