హైదరాబాద్, వెలుగు: సోనాలికా ట్రాక్టర్స్ గత నెలలో 12,392 ట్రాక్టర్లను అమ్మినట్టు ప్రకటించింది. తమ సంస్థ చరిత్రలో డిసెంబర్ లో నమోదైన అత్యధిక విక్రయాలు ఇవేనని పేర్కొంది. రబీ సీజన్ సాగు విస్తీర్ణం పెరగడం వల్ల రైతుల్లో ఉత్సాహం ఉందని జాయింట్ ఎండీ రమణ్ మిట్టల్ తెలిపారు.
అధునాతన టెక్నాలజీ గల ట్రాక్టర్లను అందించడం ద్వారా వినియోగదారుల నమ్మకాన్ని గెలుస్తున్నామని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా 18 లక్షల మందికి పైగా రైతులు సోనాలికా ట్రాక్టర్లను వాడుతున్నారని చెప్పారు.
