మహాదేవ్ సీరియల్లో పార్వతీ దేవిగా నటించి ఎంతో పాపులర్ అయింది సోనారికా భడోరియా(Sonarika Bhadoria). హిందీలో మరెన్నో సీరియల్స్ లో నటించి మెప్పించింది. జాదుగాడు చిత్రంతో టాలీవుడ్ కి పరిచయమైన సోనారిక.. ఆ తర్వాత 'స్పీడున్నోడు, ఈడో రకం ఆడో రకం చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.
ఇకపోతే హీరోయిన్ సోనారిక పెళ్లి పీటలెక్కనుంది. ప్రియుడు, వ్యాపారవేత్త వికాస్ పరశార్ను పెళ్లాడనుంది. రాజస్థాన్ లో ఫిబ్రవరి 18న వీరి వివాహం జరగనుంది. వికాస్ సొంతూరైన హర్యానాలోని ఫరీదాబాద్లో రిసెప్షన్ జరగనున్నట్లు సోనారిక తెలిపింది. కాగా 2022 డిసెంబర్లో వీరి ఎంగేజ్మెంట్ జరిగింది.
సోనారిక నటించిన సీరియల్స్,సినిమాలు..
దేవాన్ కె దేవ్..మహదేవ్ అనే సీరియల్‌లో పార్వతి దేవిగా నటించింది. దస్తాన్ ఇ మొహబ్బత్ సలీమ్ అనార్కలి సీరియల్‌లో అనార్కలిగా నటించి ప్రేక్షకులకు దగ్గయింది.అలాగే ఇంకో రెండు మూడు సీరియల్స్ కూడా చేసింది. బుల్లితెరకు మాత్రమే పరిమితం కాకుండా..వెండితెరపైనా కూడా తనదైన గ్లామర్ తో ఆడియన్స్ ను అలరించింది. జాదూగాడు, స్పీడున్నోడు, ఈడోరకం ఆడోరకం చిత్రాల్లో హీరోయిన్‌గా నటించిన పెద్దగా అవకాశాలు రాకపోవడంతో తెలుగులో నటించలేదు.
