పౌరసత్వం కేసులో సోనియా గాంధీకి భారీ ఊరట

పౌరసత్వం కేసులో సోనియా గాంధీకి భారీ ఊరట

న్యూఢిల్లీ: పౌరసత్వం కేసులో కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియా గాంధీకి భారీ ఊరట దక్కింది. భారత పౌరసత్వం పొందటానికి మూడేళ్ల ముందే సోనియా గాంధీ ఓటు హక్కు పొందారని ఆరోపిస్తూ దాఖలైన పిటిషన్‌ను ఢిల్లీ కోర్టు గురువారం (సెప్టెంబర్ 11) కొట్టివేసింది. సోనియా గాంధీకి వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్‎ను డిస్మిస్ చేసినట్లు ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు స్పష్టం చేసింది.  

కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ భారత పౌరసత్వం పొందటానికి మూడేళ్ల ముందే ఆమె పేరు ఓటర్ల జాబితాలో చేర్చబడిందని.. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన ఆమెపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని  న్యాయవాది వికాస్ త్రిపాఠి రౌస్ అవెన్యూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సోనియా గాంధీ పేరును 1980లో ఓటర్ల జాబితాలో చేర్చారని కానీ1983లో ఆమె భారత పౌరసత్వం పొందారని పిటిషనర్​కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. 

ఇండియన్ సిటిషన్ పొందటానికే ముందే ఆమె ఓటు హక్కు పొందడటం కోసం నకిలీ పత్రాలను సృష్టించారని ఆరోపించారు. ఈ పిటిషన్‎పై ఇరువర్గాల వాదనలు అదనపు చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ వైభవ్ చౌరాసియా గురువారం (సెప్టెంబర్ 11) తుది తీర్పు వెల్లడించారు. ఈ పిటిషన్‎ను డిస్మిస్ చేస్తున్నట్లు తెలిపారు. దీంతో సోనియా గాంధీకి బిగ్ రిలీఫ్ లభించింది.