సోనియా తెలంగాణ ఇచ్చిన దేవత : బీర్ల అయిలయ్య

సోనియా తెలంగాణ ఇచ్చిన దేవత : బీర్ల అయిలయ్య

హైదరాబాద్, వెలుగు: తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలకు సోనియా గాంధీ తప్పకుండా వస్తారని ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య​ తెలిపారు. తెలంగాణ ఇచ్చిన దేవత కాబట్టే ఆమెను ఉత్సవాలకు ఆహ్వానించామన్నారు. రాష్ట్రం ఇచ్చినప్పుడు కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులంతా వెళ్లి సోనియా గాంధీ కాళ్లు మొక్కారని, టీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో విలీనం చేస్తామని హామీ కూడా ఇచ్చారని గుర్తు చేశారు. సోనియా తెలంగాణ ఇవ్వకపోతే,  జగదీశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డికి పదవులు వచ్చేవే కావన్నారు. అలాంటి ఆమెను ఆవిర్భావ వేడుకలకు ఆహ్వానించడాన్ని తప్పుబట్టడాన్ని ఖండిస్తున్నామని  శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జగదీశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి మతి లేకుండా మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. పదేళ్ల పాలనలో తెలంగాణ ద్రోహులకు పెద్ద పీట వేసింది కేసీఆరేనని, మళ్లీ ఇలాంటి మాటలు మాట్లాడితే ప్రజలు జగదీశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డిని రాళ్లతో కొడతారని హెచ్చరించారు.