శాంతియుతంగా ఫైట్​ చేస్తే యువతకు మద్దతు

శాంతియుతంగా ఫైట్​ చేస్తే యువతకు మద్దతు

న్యూఢిల్లీ: కేంద్రం కొత్తగా తెచ్చిన అగ్నిపథ్ పథకంపై కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ మండిపడ్డారు. ఆ పథకానికి ఒక దిక్కు, దిశ లేదని విమర్శించారు. ఈ పథకాన్ని రద్దు చేసే వరకు కాంగ్రెస్ పోరాడుతుందని చెప్పారు. ఈ స్కీమ్ రద్దు కోసం పోరాడుతున్న యువతకు అండగా నిలుస్తామని తెలిపారు. అయితే యువత శాంతియుతంగా పోరాటం చేయాలని, హింసను వీడాలని కోరారు. ఈ మేరకు శనివారం ఆమె ప్రకటన విడుదల చేశారు. ‘‘యువత అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకుండానే కేంద్రం కొత్త పథకం తెచ్చింది. దీనిపై మాజీ సైనికులు, రక్షణ శాఖ నిపుణులు కూడా పలు ప్రశ్నలు లేవనెత్తారు” అని అందులో పేర్కొన్నారు. కాగా, శ్వాసకోశ ఇన్ఫెక్షన్ తో బాధపడుతున్న సోనియా.. ప్రస్తుతం ఢిల్లీలోని సర్ గంగారాం ఆస్పత్రిలో ట్రీట్ మెంట్ తీసుకుంటున్నారు. ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని డాక్టర్లు చెప్పారు.