హసీనాతో సోనియా ఆత్మీయ ఆలింగనం

హసీనాతో సోనియా ఆత్మీయ ఆలింగనం

మోదీ ప్రమాణ స్వీకార కార్యక్రమం కోసం ఢిల్లీ వచ్చిన బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా సోమవారం​ సోనియా గాంధీని కలుసుకున్నారు. సోనియాతో పాటు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ బంగ్లా ప్రధానిని కలుసుకున్నారు. హసీనాను ఆత్మీయ ఆలింగనంతో సోనియా గాంధీ వెల్కం చెప్పారు.

ఈ సందర్భంగా రెండు దేశాల మధ్య సంబంధాలతో పాటు వివిధ అంశాలపై చర్చించినట్లు  రాహుల్​ గాంధీ ట్వీట్ చేశారు. కాగా, శనివారమే ఢిల్లీకి చేరుకున్న హసీనా.. ఎల్​కే అద్వానీని కూడా కలుసుకున్నారు.