న్యూఢిల్లీ: సోనియా గాంధీతో దాదాపు 5 గంటలపాటు కొనసాగిన సుదీర్ఘ సమావేశం ముగిసింది. సమావేశంలో పాల్గొన్న 19 మంది అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు సోనియా. సమావేశంలో పార్టీ బలోపేతంపై తమ తమ అభిప్రాయాలు వెల్లడించారు నేతలు. నాయకులందరూ పార్టీ కుటుంబ సభ్యులే అన్నారు సోనియా. పార్టీని బలోపేతం చేసే అంశాలపై ప్రసంగించారు రాహూల్ గాంధీ. రాహుల్ నాయకత్వంపై ఎవరికీ అభ్యంతరం లేదని తెలిపారు నేతలు. మరి కొంతకాలం పాటు నేతలతో మంతనాలు కొనసాగనున్నట్లు తెలుస్తోంది. చింతన్ శిబిర్ ఏర్పాటు చేసి పూర్తి స్థాయి చర్చ జరపాలని కొందరు నేతలు కోరారు.
పార్టీని బలోపేతం చేయడం కోసం సూచనలు, సలహాలు స్వీకరించారు సోనియా. వివిధ రాష్ట్రాలలో పార్టీ పరిస్థితులపై కూడా చర్చించారు. పీసీసీల మార్పు, పార్టీ సంస్థాగత ఎన్నికల తదితర అంశాలపై కూలంకుశంగా చర్చించినట్లు సమాచారం. బీహార్ లో పార్టీ ఓడిపోవడానికి గల కారణాలపై కూడా చర్చించారట. దేశవ్యాప్తంగా పార్టీని ఏ విధంగా బలోపేతం చేయాలని..త్వరలో జరగబోయే సంస్థాగత ఎన్నికల తర్వాత నాయకత్వ మార్పుపై ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని.. కాంగ్రెస్ పార్టీ అనేది ఒక పెద్ద కుటుంబమని చెప్పింది సోనియాగాంధీ.
