కారును కొనలే..ట్రయల్స్ కోసం తెచ్చాం

కారును కొనలే..ట్రయల్స్ కోసం తెచ్చాం

సినీన‌టుడు సోనూసూద్ త‌న కొడుకు ఇషాన్‌కు రూ.3 కోట్ల విలువైన‌ కారుని ఫాద‌ర్స్ డే గిఫ్ట్ గా కొనిచ్చారంటూ ప్ర‌చారం జరుగుతోంది. అందులో కుటుంబ స‌భ్యుల‌తోనూ క‌లిసి తిరిగార‌ని తెలుస్తోంది. దీనిపై స్పందించిన సోనూసూద్ క్లారిటీ ఇచ్చారు.కారుని ట్ర‌యల్స్ కోసం తీసుకొచ్చామ‌ని తెలిపారు సోనూ సూద్. అయినా..ఫాద‌ర్స్ డే సంద‌ర్భంగా పిల్ల‌లు తండ్రికి గిఫ్ట్ ఇస్తారు కానీ, ఎక్క‌డైనా తండ్రి పిల్ల‌ల‌కి గిఫ్ట్ ఇస్తాడా? అని ప్ర‌శ్నించారు. పిల్లలు, ఫ్యామిలీతో తాను సమయం గడిపితే చాలని..అదే వాళ్లకు ఇవ్వగలిగే పెద్ద గిఫ్ట్ అన్నారు. 

కారులో భార్య, పిల్ల‌ల‌తో కలిసి కేవలం టెస్ట్‌ రన్‌కు వెళ్లానని తెలిపారు సోనూ. త‌న కుమారుడు ఇషాన్‌కి కారు కొనుగోలు చేసినట్లు వచ్చిన‌ వార్తల్లో ఎలాంటి నిజం లేదని తెలిపారు.