
పంజాబ్ లోని తమ స్వస్థలంలో ఓ రహదారికి తన తల్లి పేరు పెట్టడం పట్ల సంతోషం వ్యక్తం చేశాడు నటుడు సోనూసూద్. ఈ సందర్భంగా ఇన్ స్టాగ్రామ్ లో స్పదించిన ఆయన..నేను కలగన్న, నా జీవితాశయం నేడు నెరవేరింది. మా స్వస్థలం మోగాలో మా అమ్మ పేరిట.. ప్రొఫెసర్. సరోజ్ సూద్ రోడ్ గా రహదారికి నామకరణం చేశారు. నా జీవితంలో ఇదొక ముఖ్యమైన అధ్యాయం. అమ్మ ఏ రోడ్డు గుండా తన జీవితకాలం ప్రయాణం చేసిందో ఇప్పుడు అదే రహదారికి ఆమె పేరు పెట్టారు.
ఆ మార్గం గుండానే తను కాలేజి నుంచి ఇంటికి, ఇంటి నుంచి కాలేజీకి వెళ్లేవారు. స్వర్గంలో ఉన్న నా తల్లిదండ్రులు ఈ విషయం తెలిసి కచ్చితంగా సంతోషిస్తారు. ఈ విషయాన్ని సుసాధ్యం చేసిన హర్జోట్ కమల్, సందీప్ హాన్స్, అనితా దర్శి గారికి ధన్యవాదాలు. ఇప్పుడు నేను గర్వంగా చెప్పగలను. ఈ ప్రపంచంలో నాకు అత్యంత ఇష్టమైన ప్రదేశం ..ప్రొఫెసర్ సరోజ్ సూద్ రోడ్.. నా విజయానికి మార్గం అని చెప్పుకొచ్చాడు సోనూసూద్.
https://www.instagram.com/p/CJdJcN5ALun/?utm_source=ig_web_copy_link