BangladeshCrisis: బంగ్లాదేశ్‌లో హిందూ మహిళ ఆవేదన..హెల్పింగ్ స్టార్ సోనూసూద్ భరోసా

BangladeshCrisis: బంగ్లాదేశ్‌లో హిందూ మహిళ ఆవేదన..హెల్పింగ్ స్టార్ సోనూసూద్ భరోసా

ప్రస్తుతం బంగ్లాదేశ్‌లో ఆందోళనలు హింసాత్మకంగా మారి ఇప్పటివరకూ 300 మందికి పైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. దేశ ప్రధాని పదవికి షేక్ హసీనా రాజీనామా చేసి దేశం విడిచి వెళ్లిపోయిన పరిస్థితులొచ్చాయి. అక్కడ నెలకొన్న అల్లర్ల ప్రభావం వలస వెళ్లిన హిందువులపై తీవ్రంగా పడింది. 

ఈ క్రమంలో 'బంగ్లాదేశ్‌లో హిందూ మారణహోమం ఎలా జరుగుతోందో..ఎంతటి ప్రభావాన్ని చూపుతుందో' ఓ బంగ్లాదేశ్ హిందూ మహిళ వీడియో ద్వారా పోస్ట్ చేసింది. ఆ సదరు మహిళా తన ఆవేదనను వ్యక్తం చేస్తూ..తమ ప్రాణాలను కాపాడుకోవడానికి భారతదేశానికి వెళ్లాలని కోరింది. ఈ వీడియో చూసిన హెల్పింగ్ స్టార్ సోనూ సూద్ చలించిపోయారు. ఈ మేరకు ట్విట్టర్లో ఓ కీలక ప్రకటన చేశారు.

"బంగ్లాదేశ్ నుండి మన తోటి భారతీయులందరినీ తిరిగి తీసుకురావడానికి మా వంతు ప్రయత్నాలు చేస్తాం. తద్వారా వారు ఇక్కడ మంచి జీవితాన్ని పొందుతారు. ఇది కేవలం మన ప్రభుత్వ బాధ్యతే కాదు, మనందరి బాధ్యత..జై హింద్" అని సోనూ ట్వీట్ చేశారు.

ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో..తక్షణమే బాంగ్లాదేశ్ లో చిక్కుకుపోయిన హిందూవులను కాపాడటానికి దేశ ప్రముఖులతో పాటు ప్రతి ఒక్కరు స్పందించాలని నెటిజన్స్ ట్వీట్స్ చేస్తున్నారు.