
లాక్‌డౌన్ కారణంగా చిక్కుకుపోయిన వలస కార్మికులను ఆదుకుంటూ… వారిని సొంత గ్రామాలకు తరలిస్తున్నాడు నటుడు సోనూ సూద్. కాశీ నుంచి కన్యాకుమారి వరకు ఎవరికి ఏ ఆపద వచ్చినా ఆదుకుంటానని, భవిష్యత్తులోనూ ఈ ప్రయాణాన్ని కొనసాగిస్తాని ఆయన హామీ ఇచ్చాడు. ఈ క్రమంలో సోమవారం రాత్రి.. ఉత్తర ప్రదేశ్‌కు శ్రామిక్ రైలులో వెళ్లనున్న వలస కార్మికులను కలిసేందుకు నటుడు ముంబైలోని బాంద్రా రైల్వే స్టేషన్‌కు చేరుకున్నాడు. అయితే అతడి ప్రయత్నాన్ని పోలీసులు అడ్డుకున్నారు. అతడిని స్టేషన్‌లోనికి పంపించకుండా బయటే ఆపివేశారు. దీంతో ముంబై పోలీసుల తీరుపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై స్పందించిన ముంబై పోలీసులు సోనూ సూద్ ని అడ్డుకున్నది తాము కాదని, రైల్వే పోలీసులని స్పష్టం చేశారు. ఈ ఘటనపై ఇప్పటివరకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని తెలిపారు.