మొదట ఆంధ్రప్రదేశ్ లోనే సోనూసూద్ ఆక్సిజన్ ప్లాంట్లు

మొదట ఆంధ్రప్రదేశ్ లోనే సోనూసూద్ ఆక్సిజన్ ప్లాంట్లు

సెకండ్ వేవ్ లో కరోనా సోకిన బాధితులు ఎక్కువగా ఆక్సిజన్ కొరతతో చనిపోతున్నారు. ఇప్పటికే కరోనా బాధితులను అన్నివిధాలకు సేవలందిస్తున్న సోనూసూద్..దీనిపై తీవ్రంగా స్పందించారు. వీలైనంత మందికి ఆక్సిజన్ అందించేందుకు..ఇప్పటికే US, ఫ్రాన్స్ నుంచి ఆక్సిజన్ ప్లాంట్లను తెప్పించేందుకు సిద్ధమయ్యాయి. ఈ ప్లాంట్లను వివిధ రాష్ట్రాల్లోని అవసరమైన ఆస్పత్రుల్లో ఏర్పాటు చేయనున్నారు. అయితే మొదటి రెండు ప్లాంట్లను ముందుగా ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు,నెల్లూరులో ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టారు. కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు చేసి.. ఆ తర్వాత నెల్లూరులో ఏర్పాటు చేయనున్నారు. దానికి సంబంధించి అధికారులనుంచి  అనుమతులు కూడా తీసుకున్నారు.

ఆంధ్రప్రదేశ్ తర్వాత.. జూన్, జూలై మధ్య మరికొన్ని రాష్ట్రాల్లో మరికొన్ని ప్లాంట్లను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు ట్విట్టర్ ద్వారా తెలిపారు సోనూసూద్. ప్రస్తుతం ఏర్పాటు చేసిన ఈ ఆక్సిజన్ ప్లాంట్లతో గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య సంరక్షణను మెరుగుపరచడానికి ఎంతో అవసరమని ట్వీట్ చేశారు.